
ఒకప్పుడు హారర్ కామెడీ జానర్ తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో రూల్ చేసింది. కానీ తర్వాత ట్రెండ్ మారిపోయింది. ఈ జానర్‌కి ముగింపు వచ్చిందనుకున్నారు చాలామంది. అలాంటి సమయంలో రాఘవ లారెన్స్ మరోసారి తన హారర్ బ్రాండ్‌ను రివైవ్ చేస్తూ కాంచన 4ను ప్రకటించాడు. “ఈ జానర్ ఔట్‌డేట్ అయిపోయింది”, “డైరెక్టర్ ఫామ్‌లో లేడు”, “సినిమా గ్యాప్ ఎక్కువైంది” అంటూ వచ్చిన కామెంట్లన్నీ లారెన్స్ సైలెంట్‌గా తిప్పికొడుతున్నాడు. షూటింగ్ పూర్తి కాకముందే కాంచన 4 బిజినెస్ రేంజ్ చూసి ఇండస్ట్రీనే షాక్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం — ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్ + శాటిలైట్) కలిపి ఇప్పటికే ₹100 కోట్ల మార్క్‌ను దాటేశాయి. కేవలం అన్ని భాషల డిజిటల్ రైట్స్ ₹50 కోట్లకు అమ్ముడవగా, అసలైన బాంబ్ మాత్రం హిందీ మార్కెట్ నుంచి పేలింది. అక్కడ థియేట్రికల్ + శాటిలైట్ హక్కులు ₹50 కోట్లకు పైగా విక్రయమయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
హిందీలో ఇంత భారీ రేట్ రావడానికి కారణం లారెన్స్‌కే ఉన్న క్రేజ్. కాంచన సిరీస్‌కి నార్త్ ఇండియాలో గట్టి ఫ్యాన్ బేస్ ఉంది — ముఖ్యంగా యూట్యూబ్, శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌లలో. వాళ్లకు లారెన్స్ స్టైల్ హారర్, కామెడీ, ఎమోషన్ బాగా నచ్చుతాయి. అక్షయ్ కుమార్ లక్ష్మీగా కాంచనను రీమేక్ చేసినా ఆ సినిమా విఫలమైంది. దాంతో “లారెన్స్ ఒరిజినల్ వర్షన్‌కే సాలీడ్ సౌల్ ఉంది” అని హిందీ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఆ క్రేజ్‌నే ఇప్పుడు కాంచన 4 బిజినెస్‌లో ప్రతిబింబిస్తోంది.
ఈసారి లారెన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశాడు. హిందీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించేందుకు పూజా హెగ్డే, నోరా ఫతేహిలను హీరోయిన్లుగా తీసుకున్నాడు. వీరి గ్లామర్, డ్యాన్స్ సినిమాకు అదనపు బలాన్నిస్తాయనే నమ్మకం ఉంది. అంతేకాదు, గతంలో లారెన్స్ సినిమాలను హిందీలో డబ్ చేసి వైరల్ చేసిన గోల్డ్‌మైన్ ఫిలిమ్స్ సంస్థే ఈసారి ప్రొడక్షన్లో భాగస్వామిగా ఉంది. దీంతో హిందీ రిలీజ్, ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్లో ఉండనున్నాయి.
మొత్తానికి — ఔట్‌డేట్ అయిందనుకున్న జానర్‌తోనే, బాలీవుడ్ రీమేక్ ఫెయిల్యూర్‌ను తనకు వర్క్ అయ్యేలా మార్చుకొని, రాఘవ లారెన్స్ కాంచన 4తో వంద కోట్ల బిజినెస్ ముందుగానే సెట్ చేశాడు. ఇక థియేటర్లలో ఈ మాస్టర్ ఆఫ్ హారర్ మళ్లీ మాంత్రికం చూపిస్తాడో చూడాలి.
Recent Random Post:















