వరలక్ష్మి భర్త నికోలాయ్ విలన్‌గా ఎంట్రీకి రెడీనా?

Share


తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్‌దేవ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి అయ్యి ఏడాది పూర్తయినా, వరలక్ష్మి మాత్రం తన నటనా ప్రస్థానాన్ని ఆపకుండా యథావిధిగా కొనసాగిస్తోంది. భర్త నుంచి లభిస్తున్న ప్రోత్సాహం, స్వేచ్ఛ కారణంగా తాను ఇష్టమైన ప్రాజెక్టులు ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది.

ఇక అభిమానులు మాత్రం నికోలాయ్‌ను కూడా సినిమాల్లో చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. అతని వ్యక్తిత్వం, భారీ కటౌట్, ఫిట్‌నెస్ విలన్ పాత్రలకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఒంటి చేత్తో నలుగురిని ఎగరేసే లుక్, టాటూలతో నిండిన బాడీ, బాడీబిల్డర్ స్టైల్—all combinedగా అతనికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడుతున్నాయి.

వ‌రలక్ష్మి కుటుంబం సినిమాల్లోనే ఉండడం, కోలీవుడ్‌లో బలమైన బ్యాకప్ ఉండటం అతనికి అదనపు ప్లస్. అంతేకాక బాలీవుడ్‌లో జాన్ అబ్రహం, సుస్మితా సేన్ వంటి పలువురు స్నేహితులు ఉండటం కూడా అవకాశాలకు తోడ్పడవచ్చని అంటున్నారు.

నిజానికి నికోలాయ్ ఒక బిజినెస్‌మ్యాన్. ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతూ, ఆన్‌లైన్ వేదికగా కళాకృతులు, పెయింటింగ్‌లు విక్రయిస్తుంటాడు. వరలక్ష్మితో పదేళ్లుగా ఉన్న స్నేహం తర్వాత ఆ బంధం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో వివాహం వరకు దారితీసింది. ప్రస్తుతం ఈ జంట ఆనందకరమైన దాంపత్య జీవితం గడుపుతోంది.


Recent Random Post: