వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి ఆవేదన”

Share


వందల కోట్ల బడ్జెట్‌ ఉన్న భారీ ప్రాజెక్ట్‌ అయినా, ఇండస్ట్రీ మొత్తం మద్దతు ఉన్నా—కొన్ని చిన్న సాంకేతిక లోపాలు కూడా ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్‌లో మరోసారి స్పష్టమైంది. ట్రైలర్ ప్లే సమయంలో వచ్చిన టెక్నికల్ గ్లిచ్‌లు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిని కూడా తీవ్రంగా అసహనానికి గురి చేశాయి.

ఈవెంట్‌లో ట్రైలర్ పదేపదే స్టక్ అవ్వడంతో రెండు మూడు సార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. చివరికి విజయవంతంగా లాంచ్ చేసినప్పటికీ, ఈ జాప్యం మొత్తం అరగంటకు చేరింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన గెస్టులు, మీడియా ప్రతినిధులు, అభిమానుల మధ్య ఇలా జరిగితే ఎవరికైనా నిరాశ తప్పదు—రాజమౌళి కూడా దీనికి మినహాయింపు కాదు.

ఇందుకు కారణం ఒక డ్రోన్ అని రాజమౌళి వెల్లడించడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈవెంట్ ముందు రోజు రాత్రి ట్రైలర్ టెస్ట్ ప్లే చేసిన సమయంలో, ఒక డ్రోన్ చుట్టూ మోతాడుతూ వీడియోను రికార్డ్ చేస్తుండటం గమనించారని, లీక్ అయ్యే ప్రమాదంతో వెంటనే టెస్ట్ ప్లే నిలిపివేశానని ఆయన తెలిపారు. అంతచేసేయడంతో సరైన టెక్నికల్ చెక్ జరగలేదు. అందుకే ఈవెంట్ రోజు ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు.

జక్కన్న ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం, పైరసీ ఎంత తీవ్రమైందో, అది ఎంత పెద్ద నష్టం కలిగిస్తుందో మరోసారి చూపిస్తుంది. వందలాది మంది కష్టం, వేల గంటల శ్రమ—ఒక చిన్న లీక్‌తో బూడిదలో కలిసిపోతుంది. నైతిక విలువలు లేకుండా కొందరు తీసుకునే నిర్లజ్జ ప్రవర్తన వల్ల టాప్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు.


Recent Random Post: