
ఇండియన్ సినిమాలో భారీ అంచనాలతో ముందుకు వస్తున్న రాజమౌళి–మహేష్ బాబు చిత్రం వారణాసి ఇప్పుడే సంచలనాలు సృష్టిస్తోంది. టైటిల్ ప్రకటించిన వెంటనే సినిమా మీదున్న క్రేజ్ ఒకే స్థాయిలో లేదు. ట్రేడ్ వర్గాలు కూడా నమ్మలేని నంబర్లు వినిపిస్తుండటం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేస్తోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే, ఈ సినిమాకు ఓటీటీ సంస్థలు చూపుతున్న ఆసక్తి ఒక్క మాటలో చెప్పాలంటే ఏకంగా ఇండియన్ సినిమా మార్కెట్‌నే కొత్త స్థాయికి తీసుకెళ్తోంది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు అన్ని భాషల డిజిటల్ రైట్స్ కోసం దాదాపు రూ. 650 కోట్ల ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఇది సాధారణ సంఖ్య కాదు. ఇప్పటి వరకూ ఓటీటీ హక్కుల కోసం వచ్చిన అత్యధిక ఆఫర్లు అయిన కల్కి 2898 AD కోసం రూ. 375 కోట్లు, కేజీఎఫ్ 2కి రూ. 320 కోట్లు, ఆర్ఆర్ఆర్కి రూ. 300 కోట్లు మాత్రమే. కానీ వారణాసికి మాత్రం రెండు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేయడం రాజమౌళి బ్రాండ్ పవర్, మహేష్ బాబు స్టార్డమ్, ప్రియాంక చోప్రా గ్లోబల్ రీచ్ కలిసి తెస్తున్న మైండ్‌బ్లోయింగ్ ప్రభావానికి నిదర్శనం.
ఇంత భారీ ఆఫర్ వచ్చినా కూడా చిత్ర బృందం ఇంకా ఫైనల్ చేయలేదన్న వార్త మరింత సెన్సేషన్‌గా మారింది. సినిమా కంటెంట్‌పై మేకర్స్‌కు ఉన్న నమ్మకం ఏ రేంజ్లో ఉందో ఇదే చెబుతోంది. భారీ విజువల్స్, హాలీవుడ్ స్థాయి ప్రెజెంటేషన్, పాన్-వరల్డ్ అపీలుతో ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని టీమ్ నమ్ముతోంది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ డీల్ ఇంకా పెరగొచ్చనే మాట కూడా వినిపిస్తోంది.
ఓటీటీ రైట్స్ నుంచే ఇంత పెద్ద మొత్తం వస్తే, థియేట్రికల్ బిజినెస్, ఆడియో, శాటిలైట్ రైట్స్ కలిపి ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊహలకు అందని స్థాయిలో ఉండడం ఖాయం. ఈ వార్త నిజమైతే, ఇండియన్ సినిమాకు మరోసారి ప్రపంచ మార్కెట్లో రాజమౌళి కొత్త బెన్చ్మార్క్ సెట్ చేసినట్టే.
Recent Random Post:















