పాన్ ఇండియా స్థాయిలో ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ వార్ 2పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. యాష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేయడంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఇటీవలి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న తారక్, తన తదుపరి ప్రాజెక్ట్ వార్ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడే సినిమా గురించి ఎక్కువ చెప్పలేను, కానీ సినిమా అద్భుతంగా వచ్చింది. చెప్పినట్టుగానే ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది” అని స్పష్టంగా తెలిపారు.
తాజాగా తారక్ మాటలతో పాటు, హృతిక్ రోషన్ కూడా గత ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. జూన్–జులై మధ్య ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయనీ హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారన్న సమాచారం అభిమానుల్లో భారీ అంచనాలను రేపుతోంది.
హృతిక్–ఎన్టీఆర్‌ల మధ్య కెమిస్ట్రీ, విజువల్ యాక్షన్ ట్రీట్స్, స్పై థ్రిల్లర్ అంశాలు కలసి ఈ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. యాష్ రాజ్ స్పై యూనివర్స్‌లో మైలురాయిగా నిలిచే ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్‌పై తారక్ ఇచ్చిన క్లారిటీతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.
Recent Random Post: