విజ‌య్ చివరి మూవీ ‘జన నాయ‌గ‌న్’ ఆడియో లాంచ్‌ రికార్డు

Share


ద‌ళ‌ప‌తి విజ‌య్కి ద‌క్షిణాదితో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయ‌న నటించిన సినిమాల వసూళ్లే ఈ క్రేజ్ కు నిదర్శనం. సాధారణంగా యావరేజ్ అనుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కోట్ల కొద్దీ వసూలు చేసి విజయ్ తన మార్క్ ను నిరూపించాడు.

ఇలాంటి విజయ్, రాజకీయాల్లోకి ప్రవేశించిన నేప‌థ్యంలో సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న చివరి మూవీ జన నాయగన్. హెచ్‌. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

మొదట జనవరి 9 న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రొమోషన్లు ప్రారంభించబడ్డాయి. ఇందులో భాగంగా మలేసియాలోని కౌలాలంపూర్ లో గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేయబడింది. డిసెంబర్ 27న జరిగిన ఈ ఈవెంట్‌కు ప్రేక్షకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఈవెంట్‌లో దాదాపు 85,000 మంది అభిమానులు, సినీ లవర్స్ పాల్గొని విజ‌య్ సినిమాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ స్థాయిలో అభిమానులు, సెలబ్రిటీస్ పాల్గొన్న ఏకైక స్టార్ ఈవెంట్ గా ఈ ఆడియో లాంచ్ గుర్తించబడింది.

విజ‌య్ 30 ఏళ్ల నటనకు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో, జన నాయగన్ ఆడియో లాంచ్ పై అందరి దృష్టి పడింది. అభిమానులు ప్రపంచం నలుమూలల నుండి ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసం చేరుకుని, విజ‌య్ పై తమ అభిమానాన్ని ప్రదర్శించారు.

ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ మరియు థియేట్రికల్ బిజినెస్ పరంగానూ ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. హీరో విజ‌య్ ఈ మూవీ కోసం ₹275 కోట్ల పారితోషికం తీసుకున్నాడని కోలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇది ఒక భారతీయ నటుడు కోసం ఇంత భారీ పారితోషికం అందుకున్న మొదటి సందర్భం.


Recent Random Post: