
విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ లాంటి భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. అందుకే ఇప్పుడు ఒక బ్లాక్‌బస్టర్ హిట్తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని ఆయన మానసికంగా చాలా కసిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
అందులో ఒకటి ‘ట్యాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా. రెండోది రౌడీ జనార్థన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాజా వారు రాణి ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రవి కిరణ్ మొదటి సినిమాను క్లాస్‌గా తెరకెక్కించినప్పటి తర్వాత, ఇప్పుడు ఈ సినిమాను యాక్షన్ బ్యాక్‌డ్రాప్లో తెరకెక్కించనున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం, రౌడీ జనార్థన్ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు అక్టోబర్ 11న జరగనున్నాయి. పూజా తర్వాత మూడు-నాలుగు రోజుల రెస్ట్ తీసుకుని, అక్టోబర్ 16 నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ ముంబైలోనే ఉండనుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనున్నారు. పెళ్లి తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న కీర్తి ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేయడం ప్రారంభించనుంది. ఆమె ఇప్పటికే నాగ్ 100వ సినిమాకూ సైన్ చేసిన సంగతి తెలిసింది. అయితే కీర్తి కోసం మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recent Random Post:















