
తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ వర్మ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. తాజా సమాచారం ప్రకారం, విజయ్ ముంబైలో ఒక అద్భుతమైన సముద్రదర్శన అపార్ట్మెంట్ను సొంతం చేసుకున్నాడు. “ఇది తమన్నా కంటే బ్యూటిఫుల్” అంటూ విజయ్ చమత్కరించారు కూడా!
జుహూ లాంటి విలాసవంతమైన ఏరియాలోని ఈ అపార్ట్మెంట్లో ఇటీవల విజయ్ తన తల్లితో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటికి ఇప్పటికే ఫరా ఖాన్, ఆమె సన్నిహితులు సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు.
విజయ్ కెరీర్ విషయానికొస్తే – గల్లీ బాయ్తో గుర్తింపు తెచ్చుకున్న విజయ్, మిర్జాపూర్ 2తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. తమన్నాతో ఉన్న ప్రేమాయణం అతనికి పాపులారిటీ తీసుకొచ్చినా, ఆ సంబంధం ఎక్కువకాలం నిలబడలేదు. అయితే విజయ్ మాత్రం తన దృష్టిని పూర్తిగా కెరీర్ మీద పెట్టాడు.
ఇప్పుడు ఆయన తాజా వెబ్ సిరీస్ మట్కా కింగ్ షూటింగ్ పూర్తయ్యింది. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 1960ల ముంబైలో మట్కా జూదం నేపథ్యంతో రూపొందింది. ఈ ఏడాది చివర్లో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. అలాగే, గుస్తాఖ్ ఇష్క్ అనే సినిమాలోనూ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Recent Random Post:















