విశ్వంభర నుంచి చిరు ఫస్ట్ సాంగ్ ఏప్రిల్ 12న విడుదల

Share


భోళా శంకర్ ఫలితం నిరాశకు గురిచేయడంతో, మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ, కాస్త గ్యాప్ తీసుకుని తదుపరి ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర, UV క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

చిరు–వశిష్ట కాంబినేషన్‌ వార్త వెలువడగానే సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినా, విడుదలైన టీజర్ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా టీజర్‌లోని VFX పనితనంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. దీంతో మేకర్స్ సినిమాను వాయిదా వేసి, కొత్త VFX టీమ్‌తో పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇక తాజా అప్డేట్ ప్రకారం, విశ్వంభర సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్‌ను ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. అందుకు కృష్ణా జిల్లా నందిగామలోని పరిటాల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రత్యేకంగా ఈ సాంగ్‌ను విడుదల చేయాలని యోచనలో ఉన్నారు.

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు వశిష్ట చెప్పినట్లు, కీరవాణి ఇచ్చిన ట్యూన్లు విభిన్నంగా ఉండబోతున్నాయని, ఆ పాటలు ఆడియన్స్‌కి పూనకాలే తెప్పిస్తాయని హైప్ క్రియేట్ అయ్యింది.

విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్‌తో మళ్లీ సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో యూనిట్ బిజీగా ఉంది.


Recent Random Post: