విష్ణు జీవితంలో వెరోనికా ప్రత్యేక స్థానం

Share


మంచు విష్ణు-వెరోనికా దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతోంది. విష్ణు సక్సెస్‌లో వెరోనికా పాత్ర సగభాగమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతి విజయానికి వెరోనికా వెనుక నిలబడుతుండటం, అన్ని రకాలుగా తనకు తోడ్పాటు అందించటం విష్ణుకు ఒక బలం. వెరోనికా సినిమా రంగానికి సంబంధం లేకపోయినా, తనకంటూ ప్రత్యేకమైన బిజినెస్‌తో బిజీగా ఉంటారు. ఆమెకు దేశవిదేశాల్లో బొటిక్‌లు ఉన్నాయి. ఈవెంట్లలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విష్ణు తన భార్య గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు.

“వెరోనికాను మొదటిసారి చూసినప్పుడే ఆమె నవ్వుకి ఫిదా అయ్యాను. అదే సమయంలో, తను నా జీవిత భాగస్వామి కావాలని అనుకున్నాను. మా పరిచయం ప్రేమగా మారి, పెళ్లి వరకు దారితీసింది. నలుగురు పిల్లల బాధ్యతలు, వ్యాపార లావాదేవీలు, ఇలా ఎంత బిజీగా ఉన్నా వెరోనికా తన ఫ్యాషన్ సెన్స్‌ను ఎప్పుడూ వదలదు. నా స్టైలింగ్ వెనుక కూడా ఆమెదే పెద్ద పాత్ర,” అని విష్ణు తెలిపారు.

విష్ణు ఎప్పుడూ డిజైనర్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇతర హీరోల కంటే భిన్నంగా, ఆయన తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ని సృష్టించుకుంటారు. ఈవెంట్లలో ఆయన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. పార్టీలు, బాహ్య సందడుల కంటే, కుటుంబంతో సమయాన్ని గడపటం విష్ణుకు ఇష్టం. ఖాళీ సమయం దొరికితే పిల్లలతో ఆటలు ఆడటం, టీవీ చూడటమనే వాటినే ప్రాధాన్యం ఇస్తారట. ఇలా కుటుంబంతో గడిపే సమయం తనను ఒత్తిడి నుండి బయటపడేసి సంతృప్తినిస్తుందంటారు.

విష్ణు మొదట హనుమంతుడి భక్తుడట. అయితే ‘కన్నప్ప’ సినిమా మొదలైన తరువాత, పరమేశ్వరుడిని ఆరాధించడం మొదలుపెట్టానని తెలిపారు.


Recent Random Post: