వెంకీతో శ్రీ విష్ణు మల్టీస్టారర్ ప్లాన్ లోనారా?

Share


ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల‌కు విప‌రీత‌మైన క్రేజ్ న‌డుస్తోంది. ఏ సినిమా అయినా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయాలంటే అందులో మల్టీస్టారర్ ఎలిమెంట్ ఉంటే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఇక మంచి కంటెంట్ కూడా కలిస్తే, బాక్సాఫీస్‌ ద‌గ్గ‌ర రికార్డుల వర్షం కురవడం ఖాయం.

వెంకటేష్ ఇప్పటికే పలు మల్టీస్టారర్లలో నటించి విజయం సాధించారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన గోపాల గోపాల మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా వెంకీ వరుసగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరో యంగ్ హీరోతో కలసి సినిమా చేయనున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈసారి వెంకటేష్ సరసన కనిపించబోయే యంగ్ హీరో ఎవరో కాదు – టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు. ఇటీవల సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు, వెంకటేష్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.

ఇటీవ‌ల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు మాట్లాడుతూ – “వెంకీ గారితో తప్పకుండా ఓ సినిమా చేయాలని ఉంది. రామ్ అబ్బరాజు గారు మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఓ మంచి కథను తయారు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. కథ మొత్తం రెడీ అయిన తర్వాత వెంకటేష్ గారిని అప్రోచ్ అవుతాం. ఆయ‌న కథ వినగానే ఒప్పుకుంటారని నాకు నమ్మకం ఉంది. అది కాకపోయినా ఇంకో మంచి కథతో అయినా వెంకీ గారితో సినిమా చేయడం డ్రీమ్ లాంటిదే. ఫ్యాన్‌గా ఆయన్ను ఎలా చూపించాలో నాకు బాగా తెలుసు. మా కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది” అని తెలిపారు.

ఇకపోతే, వెంకీ – శ్రీ విష్ణు కాంబో చూస్తేనే ఓ ఫ్రెష్‌ అండ్ ఎమోషనల్ మల్టీస్టారర్‌ను ఊహించవచ్చు. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తే, అది ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌లోనూ మంచి హైప్‌ను క్రియేట్ చేసే అవకాశం ఉంది.


Recent Random Post: