వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై ఫ్యాన్స్ భారీ అంచనాలు

Share


టాలీవుడ్‌లో స్టార్ హీరోల రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. బాహుబలి తర్వాత కేవలం ప్రభాస్ స్థాయి మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీ రేంజే మారిపోయింది. ఈ ప్రభావం సీనియర్ హీరోలపై కూడా పడింది. వారూ ఇప్పుడు వయసును దాటి భారీ మార్కెట్లు టార్గెట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ సరైన ఉదాహరణ. ఇప్పటి వరకు “100 కోట్లు సాధించగలరా?” అనే అనుమానాల్ని తిప్పికొట్టారు. సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ఒక్కసారిగా 250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఓ మైలురాయి.

ఇప్పుడు వెంకీకి వచ్చే ప్రాజెక్టులపై ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. ‘‘ఇప్పటి నుంచి 300 కోట్ల క్లబ్ వైపు అడుగేయాలి. రజనీకాంత్ స్థాయిలో 500 కోట్లు కలెక్షన్స్ రాబట్టాలి’’ అనే డిమాండ్లు జోరుగా ఉన్నాయి. వెంకీ నెక్స్ట్ సినిమా కచ్చితంగా ఈ స్థాయిలో ఉండాలని అభిమానులు డైరెక్టర్స్‌ను హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్ కాంబినేషన్ ప్రాజెక్ట్‌పై చర్చ నడుస్తోంది. పుష్ప హీరో అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అవుతుండడంతో, మధ్యలో వెంకీతో తక్కువ టైమ్‌లో ఓ సినిమా చేయాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. కానీ వెంకటేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని తేలికగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.

‘‘త్రివిక్రమ్ తీసేది అనీల్ రావిపూడిని మించాలి. కంటెంట్, కమర్షియల్ అంశాలు బలంగా ఉండాలి. వెంకీకి ఓ మాస్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కావాలి’’ అంటూ సోషల్ మీడియాలో punch లు వేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నట్లు వార్తలు వస్తుండగా, త్రివిక్రమ్ ఈ చాప్టర్‌ను ఎంత సీరియస్‌గా తీసుకుంటారో చూడాలి.


Recent Random Post: