
విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా, ఎప్పటినుంచి సినిమా ప్రారంభం ఎప్పుడన్నది అందరిలో ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది.
ఇదేంటంటే, ఈ సినిమాను ఆగస్టు నెలలో ఘనంగా లాంచ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలీవుడ్ బ్యూటీల పేర్లతో పాటు సౌత్ హీరోయిన్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం.
గతంలో వెంకటేష్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు. ఇప్పుడు దర్శకుడిగా వెంకీని డైరెక్ట్ చేయనుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీతోపాటు యాక్షన్ మసాలా అంశాలు కలగలిసిన ఒక సాలిడ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతోందని టాక్.
ఇటీవల ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ మార్కెట్ మరింత పెరగగా, ఈ కొత్త సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించనుందన్న నమ్మకంతో టీమ్ సన్నాహాలు చేస్తోందట. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వెంకీ సినిమాకు, త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం పట్ల ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది.
Recent Random Post:















