వెంకీ–త్రివిక్రమ్ మూవీ: ఇంటర్వెల్ యాక్షన్ హైలైట్!

Share


Venkatesh Daggubati హీరోగా, మాటల మాంత్రికుడు Trivikram Srinivas దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎలాంటి బ్రేక్ లేకుండా యూనిట్ నిర్విరామంగా పని చేస్తుండటంతో, టాకీ పార్ట్ కూడా త్వరలో పూర్తయ్యేలా కనిపిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని Annapurna Studiosలో వేసిన భారీ సెట్‌లో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశంలో వెంకటేష్‌తో పాటు ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రథమార్థానికి హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో యాక్షన్ కంటే ఎమోషన్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి వెంకీ మామను పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించేందుకు గురూజీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ అయిన వెంకటేష్‌తో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు రావడం చాలా రేర్ అని చెప్పాలి. ఇదే సినిమాలో సెకండ్ హాఫ్‌లో కూడా మరిన్ని హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్.

ఈ చిత్రాన్ని మే నెలలోపు టాకీ పార్ట్, పాటల చిత్రీకరణ పూర్తి చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే వెంకటేష్ తన తదుపరి సినిమాపై దృష్టి సారించనున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ Anil Ravipudi దర్శకత్వంలో వెంకీ తన 78వ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది మల్టీస్టారర్‌గా తెరకెక్కనుండగా, ఇందులో Kalyan Ram కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను జూన్‌లో ప్రారంభించి, ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొత్తానికి, ఒకవైపు త్రివిక్రమ్ సినిమా క్లాస్ & మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు అనిల్ రావిపూడి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పించేలా ప్లాన్ అవుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ వెంకటేష్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Recent Random Post: