శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా పై కొత్త ఆర్థిక కేసు

Share


బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రా తరచూ వివాదాల కారణంగా వార్తల్లో ఉంటారు. కొద్ది కాలం క్రితం వీరి గురించి పెద్దగా వార్తలు రావడం లేదు అనిపిస్తుండగా, ఇప్పుడు మరో కేస్ కారణంగా వారి పేరు తిరిగి వార్తల్లో వినిపిస్తోంది.

ఈసారి వ్యాపారవేత్త దీపక్ కొఠారి శిల్పా-రాజ్ కుంద్రా జంటపై కేసు నమోదు చేశారు. గతంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ లో భాగస్వామ్యులుగా ఉన్నప్పుడు దీపక్ కొఠారి నుంచి రూ.60 కోట్లను తీసుకొని, ఆ డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం వాడినట్లు ఆయన ఆరోపించారు.

తాజాగా, ముంబై పోలీసులు శిల్పా శెట్టిని ఆమె ఇంట్లోనే విచారించారు. విచారణ సుదీర్ఘంగా సాగింది. ఆమె అన్ని సంబంధిత డాక్యుమెంట్లను పోలీసులు ముందుకు ఉంచి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని సమాచారం అందుతోంది. గతంలో కూడా శిల్పా శెట్టి కొన్ని కేసులు, ఆర్థిక వివాదాల కారణంగా పోలీసుల ముందుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఆర్థిక లావాదేవీల సమస్యతో విచారణ సీరియస్‌గా కొనసాగుతున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ముంబై వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే రాజ్ కుంద్రా కూడా ఈ కేసు కోసం పోలీసుల ముందుకు హాజరయ్యే అవకాశం ఉంది. మొదట శిల్పా శెట్టిని విచారించడానికి కారణం, రాజ్ కుంద్రా అందుబాటులో లేని పరిస్థితి. ఈ కేసులో మరింత మంది పెట్టుబడిదారులు పోలీసులు విచారించవచ్చని, వ్యవహారం పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పబడుతోంది.

అయితే, శిల్పా శెట్టి సన్నిహితులు దీపక్ కొఠారి ఆరోపణలు అవాస్తవం అని, ఈ కేసు నిలవదని వివరణ ఇచ్చారు. గతంలో రాజ్ కుంద్రా అశ్లీల వీడియోలు చిత్రీకరించి వాటితో వ్యాపారం చేశాడు అని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలుసు. ఆయనకు బిట్ కాయిన్ స్కామ్, ఇతర కేసులు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతానికి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ముంబైలోనే ఉన్నారు. వారిపై కొనసాగుతున్న వివిధ కేసుల నేపథ్యంలో, వారి అభిమానులు మరియు సన్నిహితులు ఈ పరిస్థితికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: