శివ కార్తికేయన్‌ సీక్వెల్స్‌పై క్లారిటీ – మావీరన్‌ 2 తప్ప ఇంకేదీ కాదు!

Share


‘అమరన్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శివ కార్తికేయన్‌, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పొందిన హీరోగా నిలిచారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలెట్టి, కోలీవుడ్ స్టార్‌గా ఎదిగిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు.

ఇటీవల రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో శివ కార్తికేయన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పాత్ర గురించిన క్లారిటీ మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ఇదిలా ఉండగా, శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘మదరాశి’ మరియు ‘పరాశక్తి’ సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండూ విభిన్న కథలతో వస్తుండటంతో ఆయన అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. ఇందులో ‘పరాశక్తి’ షూటింగ్ చివరి దశలో ఉందని, ఈ సినిమాలో శివ నటన విశ్వరూపంగా ఉండబోతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకురాలు సుధా కొంగర ఈ కథను ప్రేక్షకుల మ‌న‌సు దోచేలా తెరకెక్కిస్తున్నారట.

ఇటీవల జాతీయ మీడియా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సీక్వెల్స్‌ మరియు ప్రాంచైజీల గురించి మాట్లాడిన ఆయన, తాను సీక్వెల్స్‌కి పెద్దగా ఆసక్తి చూపించనని తేల్చిచెప్పాడు.

“ఒరిజినల్ సినిమాలకు ఉన్న స్థాయిని, గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా ఉండాలనేది నా నమ్మకం. ఒకవేళ సీక్వెల్ ఫెయిలైతే, ముందు భాగంపై ప్రభావం పడుతుంది. అందుకే తాను ఎప్పుడూ ఒరిజినల్ కథలకే ప్రాధాన్యత ఇస్తాను,” అని స్పష్టం చేశాడు.

అయితే ఒకే ఒక్క పరిస్థితిలో తాను సీక్వెల్ చేయగలనంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. “ఒకవేళ నిజంగానే సీక్వెల్ చేయాల్సి వస్తే, ‘మావీరన్‌ 2’ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఆ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం,” అని తెలిపారు. అయితే స్క్రిప్ట్ అత్యద్భుతంగా ఉంటేనే తాను అంగీకరిస్తానని, ప్రతిష్టాత్మకత దెబ్బ తినకుండా చూసుకుంటానని అన్నారు.

శివ కార్తికేయన్ ఈ విధంగా చెప్పిన మాటలు పరిశ్రమలో తన దూరదృష్టిని, వైవిధ్యభరితమైన సినిమాల పట్ల ఆయన కమిట్‌మెంట్‌ను చూపిస్తున్నాయి. హిట్ సినిమాలపై సీక్వెల్స్‌తో వెళ్తున్న ట్రెండ్ మధ్యలో ఆయన ప్రత్యేకమైన అభిప్రాయం వైరల్ అవుతోంది.


Recent Random Post: