
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల లెవల్‌కి చేరిన శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన చలాకీ నటన, స్టన్నింగ్ డ్యాన్స్‌లతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటుంది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేసిన శ్రీలీల.. పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ముఖ్యంగా ప్రేమపై ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది. “మీరు నిజమైన ప్రేమను కనుగొంటే.. గాలి పోకుండా పట్టుకున్నట్టుగా దాన్ని పట్టుకోండి,” అంటూ తన ఫీలింగ్స్‌ను ఓ పంచ్ డైలాగ్‌లా షేర్ చేసింది శ్రీలీల.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఆమె డేటింగ్లో ఉన్నట్టు గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరూ కలిసి బాలీవుడ్ మూవీ చేస్తున్నారు కదా.. షూటింగ్ సమయంలోనే వీరి మధ్య రిలేషన్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది.
ఇదే నేపథ్యంలో ఇటీవల కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్‌కి కూడా ఇప్పుడు కనెక్షన్ పెడుతున్నారు. “మా కోడలు మంచి డాక్టర్ అయితే బాగుంటుంది” అన్న ఆమె వ్యాఖ్యలు.. శ్రీలీల గురించేనా? అనే ఊహాగానాలు బీటౌన్‌లో వినిపిస్తున్నాయి.
ఇక ఈ జోడీకి సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్స్ ఫోటోలు కూడా రీసెంట్గా వైరల్ అయ్యాయి. వీటిపై అభిమానులు “వాళ్ల కెమిస్ట్రీ టాప్ గేర్‌లో ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక శ్రీలీల ప్రేమలో ఉందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీకి రాలేదు గానీ, ఆమె లవ్ స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
Recent Random Post:















