ఇండస్ట్రీకి కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన ఎనర్జీ, అద్భుతమైన డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ, రవితేజ సరసన నటించిన ధమాకా సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో, శ్రీలీలకు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి.
అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన శ్రీలీల, ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఆమె హిందీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవల పుష్ప 2లో అల్లు అర్జున్‌తో చేసిన స్పెషల్ సాంగ్ “కిస్సిక్” ద్వారా ఆమెకు నేషనల్ లెవెల్ గుర్తింపు వచ్చింది. ఈ పాటతో ఆమె క్రేజ్, మార్కెట్ మరింతగా పెరిగిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. నాగచైతన్య – కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందుతున్న మిస్టిక్ థ్రిల్లర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించినట్టు టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె ఉంటే ఆ సాంగ్‌కి భారీ హైప్ దక్కనుందన్నది మేకర్స్ ఆశ. ప్రస్తుతం ఈ సమాచారం అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ, శ్రీలీల మరోసారి స్పెషల్ సాంగ్ చేస్తుందన్న వార్త అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది.
Recent Random Post: