లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా బుల్లి తెర పరిశ్రమకు చెందిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు సీరియల్స్.. షోల షూటింగ్స్ తో బిజీగా ఉండే స్టార్స్.. కార్మికులు ఇప్పుడు పని లేక అల్లాడిపోతున్నారు. వారికి నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. దాంతో వీలైంనంత త్వరగా షూటింగ్స్ ను స్టార్ట్ చేయాలని బుల్లి తెర వర్గాల వారు భావిస్తున్నారు. అందుకోసం ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు.
సీరియల్స్ మరియు షో ల షూటింగ్స్ కు ఎక్కువ మంది అవసరం ఉండరు కనుక పదిహేను నుండి ఇరవై మంది అది కూడా సామాజిక దూరం పాటిస్తు చేస్తాం కనుక అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయగా ఆయన స్పందిస్తూ ఈనెల 7వ తారీకు తర్వాత ఆ విషయమై నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. తెలంగాణలో 7వ తారీకు వరకు లాక్ డౌన్ అమలులోనే ఉంటుందనే విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎలాంటి సడలింపులు ఇవ్వబోతున్నారనేది క్లారిటీ రానుంది.
సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో మాత్రం ఈ నెల చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, జూన్ మొదటి వారం నుండి చిన్న షూటింగ్స్‌కు అనుమతించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నెల రోజులు కూడా టీవీల్లో వచ్చిన కార్యక్రమాలనే మళ్లీ మళ్లీ చూడాల్సిందే. మన దేశంలో ఈనెల 17 వరకు లాక్ డౌన్ అమలులోనే ఉంటుందనే విషయం తెల్సిందే.
Recent Random Post: