సంక్రాంతి సందర్భంగా తెలంగాణకు పసుపు బోర్డు: అరవింద్ హామీ నిజం


ఈ సంక్రాంతి వేళ తెలంగాణకు ఒక విశేషమైన బహుమతి లభించింది. తెలుగు ప్రజలు ఏళ్లుగా ఎదురుచూసిన జాతీయ పసుపు బోర్డు ఈ పండుగ సమయంలో నిజామాబాద్ లో ప్రారంభమవుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ బోర్డు ప్రారంభోత్సవాన్ని చేయనున్నారు.

ఇక, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా నిజామాబాద్ కి చెందిన పల్లె గంగా రెడ్డి నియమితులయ్యారు. కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. నేడు బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా గంగా రెడ్డి పలు పంచుకోనున్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌ కు చెందిన గంగా రెడ్డి ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో పసుపు రైతులున్న గ్రామంలో పుట్టారు.

మరొక వైపు, బీజేపీ యువనేత మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నట్లు చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా నిలిచిన అరవింద్, తనను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఈ హామీతోనే కవితను ఓడించి గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత, ఆయన పసుపు బోర్డు కోసం కృషి చేశారు. అయితే 2024 ఎన్నికల దాకా కేంద్రం వివిధ కారణాలతో ఆలస్యం చేసింది. కానీ, అరవింద్ ను రెండవసారి ఎంపీగా గెలిపించిన ప్రజల ఒత్తిడితో, కేంద్రం నేడు పసుపు బోర్డు ప్రారంభానికి ఒప్పుకుంది.


Recent Random Post: