
పాన్ ఇండియా వైడ్‌గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను నిర్మించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఫ్యాన్స్‌లో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
ప్రభాస్ లాంటి పవర్ఫుల్ కటౌట్‌తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. సినిమా విడుదలను 2027 మార్చికి ప్లాన్ చేయగా, అందుకు తగ్గట్టుగా షెడ్యూల్స్‌ను కూడా పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నాడట సందీప్ వంగ.
ఇప్పటివరకు స్పిరిట్ నుంచి రిలీజైన పోస్టర్లు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, నెక్స్ట్ షెడ్యూల్‌ను మెక్సికోలో ప్లాన్ చేశాడట దర్శకుడు. అక్కడ మెయిన్ కాస్ట్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. సినిమా తీయడమే కాదు, దాన్ని ప్రమోట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేయడం కూడా ఎంత ముఖ్యమో సందీప్‌కు బాగా తెలుసు. ఈ విషయంలో రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు సందీప్ వంగ కూడా అదే రేంజ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రతి అప్డేట్తో స్పిరిట్ మీద హైప్ పెంచుతూ ఫ్యాన్స్‌ను హుక్ చేస్తున్నాడు.
సందీప్ వంగ సినిమా అంటేనే అది వేరే లెవెల్ అనే ఫీలింగ్ ఉంది. ఇక అందులో ప్రభాస్ లాంటి హీరో ఉంటే, ఊహించుకోవడానికే గూస్బంప్స్ వస్తున్నాయి. కథ, కథనం పక్కన పెడితే, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే స్పిరిట్ సినిమా ఓ రేంజ్ హై ఇస్తుందని రెబల్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే, స్పిరిట్‌తో పాటు హను రాఘవపూడితో ఫౌజీ సినిమాను కూడా చేస్తున్నాడు. ఫౌజీ సినిమాను ఈ ఏడాది రెండో భాగంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది రాజా సాబ్ సినిమాతో నిరాశపరిచిన ప్రభాస్, ఫౌజీతో ఖుషి చేసి, స్పిరిట్‌తో తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు. సందీప్ వంగ సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి స్పిరిట్‌తో రుజువు చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించి భారీ క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తిని, ప్రభాస్‌కు జోడీగా సందీప్ వంగ ఫిక్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత త్రిప్తికి మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా సందీప్ వంగ – ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమా సినీప్రియులకు ఓ పూర్తి స్థాయి మాస్ ఫీస్ట్ అందిస్తుందనే నమ్మకం బలంగా ఉంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో అంచనాలను పెంచుకుంటూ వచ్చిన సందీప్, స్పిరిట్‌తో వేరే లెవెల్ మాస్ చూపిస్తాడని టాక్. అది ఏ రేంజ్లో ఉంటుందో చూడాలంటే, వచ్చే ఏడాది రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. 🔥
Recent Random Post:















