సప్తమి గౌడకు తెలుగులో తొలి అవకాశం

Share


పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన ‘కాంతార’ చిత్రంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ, ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘కాంతార’ తర్వాత హిందీలో ‘వ్యాక్సిన్ వార్’ వంటి ప్రాజెక్టుల్లో నటించిన ఆమె, ఇప్పుడు నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు.

వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సప్తమితో పాటు వర్ష బొల్లమ్మ కూడా కథానాయికగా నటించారు. అయితే సినిమాలో ముఖ్య పాత్ర పోషించినప్పటికీ, సప్తమికి హీరో నితిన్‌తో కేవలం రెండు గంటల మాత్రమే చిత్రీకరణ జరిగిందట. “నితిన్ గారితో కాంబినేషన్ సీన్స్ తక్కువే ఉండటంతో, చాలా ఎక్కువగా సోలో సీన్లే ఉన్నాయి. అందుకే షూటింగ్ సమయంలో అతనితో మాట్లాడే అవకాశమూ ఎక్కువగా రాలేదు,” అని ఇటీవల ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.

తన పాత్ర కథలో కీలకమై, ముఖ్యమైన మలుపు తిప్పే విధంగా ఉంటుంది అని చెప్పిన సప్తమి, “కాంతార’లో నా నటన చూసే ఈ సినిమాలో అవకాశం ఇవ్వలేదు. దర్శకుడు ఆడిషన్ ద్వారా నాకు ఛాన్స్ ఇచ్చారు,” అని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవడం వల్ల తన తెలుగు డెబ్యూ ఆలస్యం అయిందని చెప్పారు. అయితే ఆలస్యం అయినా సరే, ‘తమ్ముడు’ మంచి ఫలితాన్ని అందుకుంటుందని, ఈ సినిమా తన కెరీర్‌కు కొత్త ఊపునిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘తమ్ముడు’ చిత్రం ఈ వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Recent Random Post: