సమంత రిజెక్ట్ చేసిన పాత్రలో రష్మిక దూసుకెళ్లింది

Share


స్టార్ హీరోయిన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న వరుస సినిమాలతో జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్టులు, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు — రెండింటినీ సమాంతరంగా బాలెన్స్‌ చేస్తూ అద్భుతంగా కొనసాగుతున్నారు. ఇటీవల థామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక, ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్‌తో రానున్నారు.

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక లీడ్‌ రోల్‌లో నటించగా, దసరా ఫేమ్‌ దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌, పోస్టర్లతో మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది.

అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాను మొదటగా సమంతకు ఆఫర్‌ ఇచ్చారని, ఆమె తిరస్కరించడంతో రష్మికకు వెళ్ళిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్‌పై దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తాజాగా స్పందించారు. “మొదట ఈ కథను సమంత గురించి అనుకున్నాను. కానీ కథ మొత్తం చదివిన తర్వాత, తాను చేయడానికి సరైన వ్యక్తి కాదని సమంత చెప్పింది. ‘ఈ కథను వేరే హీరోయిన్‌ చేస్తేనే బాగుంటుంది’ అని సామ్‌ నిజాయితీగా చెప్పింది,” అని ఆయన వెల్లడించారు.

తర్వాత రష్మికను సంప్రదించగా, ఆమె రెండు రోజుల్లోనే స్క్రిప్ట్‌ చదివి కాల్‌ చేసి ‘నేను తప్పకుండా చేస్తాను’ అని చెప్పిందట. “స్క్రిప్ట్‌లో ఉన్న ఎమోషన్స్‌, అమ్మాయిలు బలంగా కనెక్ట్‌ అయ్యే అంశాలు రష్మికను బాగా ఆకట్టుకున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్‌ ఆమెకు చాలా స్పెషల్‌ ప్రాజెక్ట్‌గా మారింది,” అని రాహుల్‌ తెలిపారు.

అలాగే యానిమల్ వంటి మాస్‌ హిట్‌ తర్వాత రష్మికను పూర్తిగా రియలిస్టిక్‌ లుక్‌లో చూపించాలన్న ఆలోచనలో కొంత టెన్షన్‌ ఉన్నప్పటికీ, రష్మికే “నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర చేయాలని” చెప్పిందట.

మొత్తం మీద, సమంత నిజాయితీగా వెనక్కి తగ్గిన కథలో రష్మిక తన నమ్మకంతో ముందుకు వెళ్లి ఈ సినిమా చేసింది. దీంతో ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా రష్మిక కెరీర్‌లో మరో ఎమోషనల్‌ హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది.


Recent Random Post: