
టాలీవుడ్ బడా నిర్మాతల్లో దిల్ రాజు పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా ఎదిగారు. తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ, ఇతర చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఇండస్ట్రీలో బలమైన స్థానం సంపాదించారు.
ఇటీవల యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు “దిల్ రాజు డ్రీమ్స్” అనే కొత్త విభాగాన్ని కూడా ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ ద్వారా యంగ్ టాలెంట్‌కి అవకాశం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమాల తర్వాత దిల్ రాజు కొద్దిగా విరామం తీసుకున్నారు. ఇప్పుడు ఆ బ్రేక్ తర్వాత మళ్లీ వరుసగా భారీ సినిమాలను ప్రణాళిక చేస్తున్నారని సమాచారం. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఆయన అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇదే సమయంలో బాలీవుడ్‌లో రెండు పెద్ద బడ్జెట్ చిత్రాలు కూడా దిల్ రాజు నిర్మించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
దిల్ రాజు బాలీవుడ్‌లో హిట్, జెర్సీ వంటి సక్సెస్‌ఫుల్ రీమేక్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కొత్తగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు.
టాలీవుడ్‌లో క్లాస్-మాస్ సినిమాలకు బ్రాండ్‌గా నిలిచిన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ ఇప్పటికే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని టాక్.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు, షెడ్యూల్ వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో ఒక భారీ క్లాస్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు లీకైన సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా, లాభాల్లో వాటా పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. దిల్ రాజు సాధారణ ఫీజు కాకుండా, ప్రాఫిట్స్‌లో పెద్ద షేర్ ఇవ్వనున్నారని టాక్. సల్మాన్ కూడా ఆ ఆఫర్‌కి ఓకే చెప్పారట.
Recent Random Post:















