
భారీ పారితోషకాలతో సినిమాల్లో నటించే స్టార్‌ల జీవితాన్ని పర్ఫెక్ట్‌గా అనుకుంటాం. కానీ వారి జీవితంలో కూడా వ్యక్తిగత, ఆరోగ్య సంబంధ సమస్యలు ఉంటాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ తరహా పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన లవ్ లైఫ్ ఎప్పుడూ సజావుగా సాగలేదు. పలు సంబంధాల తరువాత, రొమేనియా బ్యూటీ లూలియా వాంటూర్తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ప్రస్తుతం వీరి బంధం గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
60 ఏళ్ళ దగ్గర పడినప్పటికీ, సల్మాన్ ఎక్కువ కాలం బ్రహ్మచారిగా ఉన్నారని అంటారు. జీవితంలోని ఎప్పటికప్పుడు నిలకడగా లేకపోయే బంధాలతో పాటు, ఆరోగ్య సమస్యలు కూడా ఆయన పెళ్లి చేసుకోవడంలో అడ్డంకిగా ఉన్నాయి. కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న టీవీ షోలో సల్మాన్ తన సమస్యల గురించి వెల్లడించారు, అభిమానులను కదిలించారు.
సల్మాన్ ఏడున్నరేళ్లుగా ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే నర సంబంధ వ్యాధితో పోరాడుతున్నారని చెప్పారు. ఈ సమస్య వల్ల ప్రతి నాలుగు నుంచి ఐదు నిమిషాలకు ముఖంలో తీవ్ర నొప్పి కలుగుతుంది. నొప్పి తగ్గించుకోవడానికి రోజూ పెయిన్ కిల్లర్లు తీసుకోవాల్సి వస్తుంది. సల్మాన్ ఒక క్రిటికల్ సర్జరీ కూడా చేసుకున్నారని, దాంతో నొప్పి పూర్తిగా తగ్గిందని తెలిపారు.
ట్రైజెమినల్ న్యూరాల్జియా వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా రావచ్చని, సరిగా చికిత్స పొందకపోతే మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతాయని సల్మాన్ వివరించారు. ఈ వ్యాధితో పోరాడుతూ సినిమాల్లో విరామం లేకుండా నటిస్తూ ఉన్న సల్మాన్, ఇప్పుడు ఈ సమస్యను పబ్లిక్‌కు తెలియజేసిన కారణం ప్రజల్లో అవగాహన పెంచడమే అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా, ఇప్పుడు చికిత్స మెరుగై, ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని, నివారించవచ్చని తెలిపారు.
Recent Random Post:















