
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లికి దూరంగా ఉన్నప్పటికీ, తన కుటుంబ సభ్యుల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలు అతడిని ప్రభావితం చేశాయి. అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా విడాకుల అనంతరం వారి కుమారుడు అర్హాన్ ఖాన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడని సల్మాన్ ఖాన్ తాజా పాడ్కాస్ట్లో పేర్కొన్నారు.
అర్హాన్ తన యూట్యూబ్ పాడ్కాస్ట్ డంబ్ బిర్యానీలో మామా సల్మాన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాడు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల విడాకుల వల్ల అర్హాన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని, అతను తన జీవితాన్ని స్వయంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. “అమ్మా నాన్న విడిపోయాక, జీవితాన్ని ముందుకు సాగించే బాధ్యత నీవే తీసుకోవాలి. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంతో కలిసి గడపడం, భోజనం చేయడం అనేది ఎప్పటికీ కొనసాగాలి. కుటుంబ పెద్దను గౌరవించాలి,” అని సల్మాన్ పేర్కొన్నారు.
అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 1998లో వివాహం చేసుకుని, 2017లో విడిపోయారు. వారి కుమారుడు అర్హాన్ 2002లో జన్మించాడు. ప్రస్తుతం అర్హాన్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుండగా, అతని సినీ ప్రయాణానికి సల్మాన్ ఖాన్ కీలక భరోసా అవుతారని భావిస్తున్నారు.
Recent Random Post:















