
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఇటీవల ఒక అవార్డ్ వేడుకలో మాట్లాడుతూ, ఆంటీ తరహా పాత్రలు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ముఖ్యమైన పాత్రల్లో నటించాలని అనుకోవడం లేదని, సినిమా లో మూడు నాలుగు సీన్స్‌లో కనిపించే డబ్బా పాత్రలు చేయాలని తనకు ఆసక్తి లేదని వెల్లడించింది. ఆమెకు వస్తున్న ఆఫర్ల విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా చెప్పింది. అయితే సిమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చలకు దారి తీసినాయి.
కొందరు ప్రేక్షకులు, ఈ వ్యాఖ్యలు జ్యోతిక గురించి ఉద్దేశించి చేసినవిగా భావిస్తున్నారు. జ్యోతిక ఇటీవల కొన్ని డబ్బా పాత్రలు చేసుకుంటూ విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె పాత్రలు ప్రాముఖ్యత లేకుండా, చిన్న సన్నివేశాల వరకు మాత్రమే పరిమితం అవుతాయని చెప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో “డబ్బా పాత్రలు చేయాల్సిన అవసరం ఏమిటి?” అని కూడా ట్రోల్స్ చేస్తున్నారు.
సిమ్రాన్ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో, జ్యోతిక అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమ్రాన్ పేర్కొన్న మాటలకు జ్యోతిక నేరుగా స్పందించకపోయినా, ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో సిమ్రాన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో సిమ్రాన్ స్పందిస్తూ, ఆమె ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, తన అనుభవాల గురించి మాట్లాడే ప్రయత్నమే చేశానని వివరణ ఇచ్చింది.
సిమ్రాన్ ఇలా చెప్పింది: “సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, హీరోయిన్స్ మధ్య స్నేహం సౌహార్దంగా ఉండటం చాలా అరుదు. రెండు హీరోయిన్స్ మధ్య సంబంధాలు ఎక్కువ కాలం నిలబడటం అసాధ్యం. నేను చెప్పినది నా అనుభవమే, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు.”
జ్యోతిక అభిమానులు సిమ్రాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “మన పని మీద నమ్మకం ఉంచుకుని, ఎవరినీ విమర్శించడం లేదా తక్కువ చేయడం సరికాదు” అని ట్వీట్ చేస్తున్నారు. వారు సిమ్రాన్‌కు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ఆమె భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇప్పుడు ఈ వివాదం క్రమంగా ముదిరి, సిమ్రాన్ మరోసారి స్పందిస్తుందా, జ్యోతిక అభిమానులు తనపై మరిన్ని ట్రోల్స్ చేస్తారా అన్నది చూడాలి.
Recent Random Post:















