
సూర్య హీరోగా ఆర్జె బాలాజీ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం నిన్న కోటి రూపాయల పూజ ఖర్చుతో జరిగి, నయనతార మూకుతి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి) కి మొదట బాలాజీ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే, నిర్మాతతో అభిప్రాయ భేదాలు రావడంతో బాలాజీ ఈ ప్రాజెక్ట్ను వదిలి, సూర్యకు కథ చెప్పి, ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. చెన్నై టాక్ ప్రకారం, ఈ రెండు సినిమాల మధ్య కొన్ని సారూప్యతలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కంటెంట్లో పోలికలు ఉంటే కోర్టు వివాదాలు తప్పక వచ్చేవని అంచనా వేస్తున్నారు.
సూర్య నటిస్తున్న ఈ సినిమాకి 45 స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి తాజా సమాచారం ప్రకారం, ఇది 10 సంవత్సరాల క్రితం వచ్చిన వెంకటేష్, పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాకు దగ్గరగా ఉండి, ఇది బాలీవుడ్ హిట్ సినిమా ఓ మై గాడ్ రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక పాత్రలో దేవుడు, మరొకటిలో లాయర్ గా కనిపిస్తాడట. దేవుడు అనుకోని పరిస్థితుల్లో భూమి మీదకు వచ్చినప్పుడు అతని తరఫున న్యాయవాది వాదించాల్సి వస్తుంది. ఈ కథలో వచ్చే డ్రామా కారణంగా బడ్జెట్ పెరిగిందని ఇన్సైడ్ టాక్.
అంటే, వెంకీ మరియు పవన్ తరహా క్యారెక్టర్లను సూర్య (దేవుడు, లాయర్) ఒక్కడే చేస్తాడన్న మాట. ఇది అధికారికంగా ప్రకటించబడకపోయినా, లీక్ అయిన సమాచారం ప్రకారం ఇది స్పష్టంగా తెలుస్తోంది. నయనతార మూకుతి అమ్మన్ 2లో కూడా దేవుడు వర్సెస్ హ్యూమన్ పాయింట్ తో కూడిన కథ సి సుందర్ రాసుకున్నారని చెప్తున్నారు. యముడు భూలోకంకు వచ్చి నాటకీయతను సృష్టించడం చాలాసార్లు చూశాం, కానీ దేవుడు భూమి మీద ఫుల్ లెంగ్త్ సినిమా నడిపించడం చాలా అరుదైనది. ఇది రావుగోపాల్ రావు ‘మా ఊళ్ళో మహాశివుడుతో’ మొదలై, గోపాల గోపాల దాకా వచ్చింది.
కార్టీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య చేస్తున్న రెట్రో సినిమా విడుదల తర్వాత, సూర్య 45 సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు మొదలవుతాయని సమాచారం.
Recent Random Post:















