
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తాజా చిత్రం “కరుప్పు” షూటింగ్‌ను పూర్తిచేశాడు. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత సూర్య, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.
ఇక సూర్య 48వ సినిమాపై క్లారిటీ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను సూర్య స్వయంగా నిర్మించబోతున్నారు. ఆయన తాజాగా ప్రారంభించిన అగరం స్టూడియోస్ బ్యానర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు 2డి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా పలు సినిమాలు నిర్మించిన సూర్య, ఇప్పుడు కొత్తగా అగరం స్టూడియోస్‌తో అడుగుపెట్టడం విశేషం.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. సూర్య–పా.రంజిత్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంజిత్ సినిమాలు సాధారణంగా విభిన్నమైన కంటెంట్‌తో వస్తాయని తెలిసిందే. ఆయన విక్రంతో చేసిన తంగళాన్ బజ్ సృష్టించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు.
అయితే సూర్యతో చేస్తున్న ఈ సినిమా మాత్రం ప్రత్యేకంగా ఉండబోతుందని, మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారని టాక్. కొత్త బ్యానర్లో నిర్మించడానికి సూర్య చూపిన ఆసక్తి కూడా కథపై ఉన్న విశ్వాసమేనని తెలుస్తోంది.
ప్రస్తుతం పా. రంజిత్ తన వెట్టువం సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తుండగా, సూర్య కూడా వెంకీ అట్లూరితో చేస్తున్న ప్రాజెక్ట్‌ను త్వరలో పూర్తి చేయబోతున్నాడు. వీటి తర్వాతే సూర్య–పా. రంజిత్ కాంబో ప్రారంభం అవుతుంది.
ఇటీవలి కాలంలో సూర్య సినిమాలు ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాకపోవడంతో ఆయన నిరాశలో ఉన్నప్పటికీ, కరుప్పు, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్, అలాగే పా. రంజిత్ సినిమా సూర్య కెరీర్లో తిరుగుబాటుగా మారతాయనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
Recent Random Post:















