సైయారా రీమేక్ వివాదం : మేకర్స్ క్లారిటీ ఇస్తారా?

Share


సైయారా సినిమా ఇప్పుడు సినీప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. విడుదలైన రెండు రోజుల్లో శుక్ర, శనివారాలు కలిపి రూ.45 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

చిక్కి పాండే తనయుడు, అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే హీరోగా పరిచయమయ్యారు. హీరోయిన్‌గా అనీత్ పడ్డా నటించింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అక్షయ్ విధాని నిర్మించారు. ఇద్దరూ డెబ్యూ చేసినప్పటికీ హీరో, హీరోయిన్‌ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. మోహిత్ సూరి స్టైల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం కూడా ఓ మాయాజాలంలా ఉంది అంటున్నారు.

సోల్ ఫుల్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రేమలో వచ్చే బాధ, హార్ట్ బ్రేక్, హీలింగ్ అనే కాన్సెప్ట్‌ను బాగా చూపించారని చెప్పుకుంటున్నారు. అయితే కథలో ఒరిజినాలిటీ లేదని కొంత మంది విమర్శిస్తున్నారు. 2004లో వచ్చిన కొరియన్ సినిమా ‘ఎ మూమెంట్ టు రిమెంబర్’ కథను పోలి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆ చిత్రాన్ని జాన్ హెచ్ లీ రూపొందించగా, అల్జీమర్స్ వ్యాధి నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరీ చూపించారు. ఇప్పుడు సైయారా కూడా ఆ లైన్‌లోనే ఉందని, ఇది అనధికారిక రీమేక్ అని కొందరు అంటున్నారు. కనీసం ఒరిజినల్‌కు క్రెడిట్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఇంకొందరు మాత్రం సైయారా రీమేక్ కాదని, కథ ప్రేరణ తీసుకున్నప్పటికీ, మన ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మోహిత్ సూరి స్టైల్‌లో తెరకెక్కించారని అంటున్నారు. పైగా ‘ఎ మూమెంట్ టు రిమెంబర్’ కూడా ఒక జపనీస్ డ్రామా ఆధారంగా తీసినదే కదా అని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ చర్చలపై మేకర్స్ స్పందించలేదు. మరి దీనిపై ఏవైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.


Recent Random Post: