
బాలీవుడ్ తాజా చిత్రం సైయారా అంచనాలు లేకుండా విడుదలై ప్రస్తుతం దేశవ్యాప్తంగా హవా కొనసాగిస్తోంది. వన్ ప్లస్ వన్ ఆఫర్లతో ప్రారంభమైన ఈ ప్రేమ కథ, విడుదలైన తొలి వారంలోనే భారీ స్పందనను రాబట్టింది. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో గంటకు సగటున 30 వేల టికెట్లు అమ్ముడవుతున్నదే ఇందుకు నిదర్శనం.
సమకాలీనంగా విడుదలైన పెద్ద సినిమాలు — హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, తలవైన్ తలవి — వీటితో పోలిస్తే సైయారా గ్రౌండ్ లెవెల్ వద్ద స్పష్టంగా ముందంజలో ఉంది. ముఖ్యంగా 18–25 ఏళ్ల మధ్య యూత్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. సినిమా క్లైమాక్స్ సమయంలో థియేటర్లలో భావోద్వేగం గురి అయిన యువతులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రొడక్షన్ హౌస్ తెలిపిన సమాచారం ప్రకారం, సైయారా ఇప్పటివరకు ₹256 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను దాటేసింది. వీకెండ్ కలెక్షన్ల ఆధారంగా ₹500 కోట్లు దాటే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ విశ్లేషణ. ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లోనే కాదు, బీ టియర్ పట్టణాల నుంచీ హౌస్‌ఫుల్ షోలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా మంచి రన్‌ను కొనసాగిస్తోంది. హరిహర వీరమల్లు వచ్చినప్పటికీ, జిల్లా కేంద్రాల్లో సైయారా ప్రదర్శన నిలకడగా కొనసాగుతుండటం విశేషం.
అయితే, విజయంతో పాటు కొన్ని విమర్శలూ వినిపిస్తున్నాయి. దర్శకుడు మోహిత్ సూరి ప్రేమ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన భావోద్వేగంతో చూపించిన తీరు, టీనేజ్ ప్రేక్షకులపై భావప్రబలత కలిగించొచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతంలో ఓ ఇంటర్ విద్యార్థిని సినిమా చూసిన తర్వాత కాలేజ్ భవనంపై నుంచి దూకిన ఘటనకు సైయారాని ముడిపెట్టి వస్తున్న ఆరోపణలు చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఇది పరోక్ష సంబంధమని, సినిమాకు నేరుగా లింక్ చేయడం తప్పని పలువురు విశ్లేషకుల అభిప్రాయం.
సినిమా విజయానికి కారణం కంటెంట్ లేదా ప్రచార వ్యూహమా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సెంటిమెంట్‌తో నిండిన కథనం, ఆకట్టుకునే సంగీతం, యూత్‌కు సంబంధించిన ప్రస్తుత కాల ప్రభావాలు సైయారా విజయానికి దోహదపడినట్టు ట్రేడ్ విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే కొన్ని వర్గాలు సినిమాపై ఉన్న ఊహాగానాలు కంటే, ఫైనల్‌గా “బాగుంది కానీ, అంత అద్భుతం అనిపించలేదు” అనే మిశ్రమ స్పందనను వెల్లడిస్తుండటం గమనార్హం.
Recent Random Post:















