
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిక్యాన్సర్లకు ఎన్నో రకాలు ఉంటాయని, ప్రతి క్యాన్సర్‌కు లక్షణాలు, చికిత్సలు భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే విధమైన మార్గాన్ని సూచించే ఉద్దేశ్యం తనదేమీ కాదని స్పష్టం చేశారు. తన అనుభవాన్ని మాత్రమే చెప్పానని, ఎవరినీ ప్రకృతి వైద్యం తీసుకోమని ప్రోత్సహించలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.న్‌గా రాణించిన సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడటంతో సినిమాల నుండి దూరమయ్యారు. కఠినమైన చికిత్సలు తీసుకొని ధైర్యంగా క్యాన్సర్‌ను జయించినప్పటి నుంచీ సోనాలి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, అనేక మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వస్తున్నారు.
అయితే, ఇటీవల సోనాలి చేసిన వ్యాఖ్యలు అనూహ్యంగా వివాదానికి దారితీశాయి. ప్రకృతి వైద్యం తన క్యాన్సర్ రికవరీకి సహాయపడిందని చెప్పడంతో కొంతమంది వైద్యులు ఆమెను తప్పుబట్టారు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ విమర్శలపై సోనాలి తాజాగా ఎక్స్‌లో స్పష్టత ఇచ్చారు. తాను ఎప్పుడూ డాక్టర్‌ని అని చెప్పలేదని, తానేమీ మోసగత్తె కాదని ఆమె స్పష్టం చేశారు. క్యాన్సర్ వల్ల వచ్చే భయం, నొప్పి, బాధను తాను అనుభవించానని, అందుకే తన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నానని ఆమె తెలిపారు.
క్యాన్సర్లకు ఎన్నో రకాలు ఉంటాయని, ప్రతి క్యాన్సర్‌కు లక్షణాలు, చికిత్సలు భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే విధమైన మార్గాన్ని సూచించే ఉద్దేశ్యం తనదేమీ కాదని స్పష్టం చేశారు. తన అనుభవాన్ని మాత్రమే చెప్పానని, ఎవరినీ ప్రకృతి వైద్యం తీసుకోమని ప్రోత్సహించలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.
సోనాలి ఇచ్చిన ఈ వివరణతో సోషల్ మీడియాలో నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
Recent Random Post:














