
ప్రముఖ నటుడు, సేవా కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్న సోనూసూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనాలి సూద్ తన సోదరి, సోదరి కుమార్తెతో కలిసి ముంబై-నాగపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె డ్రైవ్ చేస్తున్న కారు ట్రక్‌ను ఢీకొట్టింది. అయితే, వెంటనే ఎయిర్‌బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు అధిక వేగంలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు.
ప్రమాదంలో సోనాలి సూద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారులో ఉన్న సోదరి, సోదరి కుమార్తె కూడా తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.
ఈ వార్త వైరల్ కావడంతో సోనూసూద్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో సోనూసూద్ కారులో లేరని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో సోనాలి ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ ఆమె ఆరోగ్యంపై అప్డేట్స్ కోరుతున్నారు.
కరోనా సమయంలో సోనూసూద్ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో సోనాలి సూద్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటం పట్ల అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో సోనూసూద్ కుటుంబం వార్తల్లో నిలవగా, ఆయన భార్య ఆరోగ్యం విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
Recent Random Post:















