
ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఓ వేరే ప్రపంచమే అయిపోయింది. ఎవరు ఏమి చేస్తున్నారో కన్నా, ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారన్నదే ఎక్కువ చర్చ. కొందరు నిజంగా కెరీర్ కోసం సోషల్ మీడియా వాడితే, మరికొందరు పక్కా పాస్ టైం కోసం అకౌంట్లు తెరిచి ఫ్యాన్ వార్స్ నడిపిస్తున్నారు. ఫాలోవర్స్ సంఖ్యను చూసుకుని తామేదో గ్రేట్ అన్న ఫీలింగ్ లో బతికిపోతున్నారు. కానీ, ఈ నంబర్లు ఎంతవరకు రియల్ ఎఫెక్ట్ కలిగిస్తాయనేది డిబేటబుల్.
ఇలాంటి డిబేట్ కి పూజా హెగ్డే ఇచ్చిన సమాధానం మాత్రం అసలైన షాట్ గన్ లాంటి బలమైనదిగా మారింది. “నాకు దాదాపు 30 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కానీ వాళ్లంతా థియేటర్ కి వస్తారని ఎలా అనుకోగలం? కొంతమంది సూపర్‌స్టార్స్ కి 5 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉండరు, కానీ వాళ్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు చేస్తాయి,” అంటూ ఓ క్లాస్ లెక్చర్ ఇచ్చేసింది.
సోషల్ మీడియా, బాక్సాఫీస్… ఇవి రెండూ వేర్వేరు ట్రాక్స్ అని, ఒకటి ఇంకొన్ని ప్రభావితం చేస్తుందని అనుకోవడం తప్పేనని చెప్పేసింది. నటీనటులు, ఫ్యాన్స్ – అందరూ ఈ మాటలు ఓసారి తలలో వేసుకోవాల్సిందే!
ఇక పూజా హెగ్డే ఈ వ్యాఖ్యలు చేసింది మే 1న విడుదలకాబోతున్న ‘రెట్రో’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పూజా పాత్ర చాలా పరిపక్వంగా ఉండబోతోందట. ఎక్కువ డైలాగులు లేని ఓ సీరియస్ క్యారెక్టర్… కథకు కీలక మలుపు ఇచ్చేలా డిజైన్ చేసినట్లు టాక్.
“పదిహేను నిమిషాల సింగిల్ టేక్ సీన్లో నటించాను. అది తెరపై చూడటానికి చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది,” అని చెబుతోంది పూజా. మూడు సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకి, ఈ ‘రెట్రో’ విజయం పండు తినిపించగలుగుతుందా లేదా అన్నది మే 1న తేలనుంది!
Recent Random Post:















