
కాలం మారినా, వయసు పెరిగినా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం చాలా అరుదు. అయితే త్రిష మాత్రం 40 ఏళ్ల వయసులోనూ తన అందంతో, గ్లామర్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ఆమెకు ఇప్పటికీ ఉండే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయాలు, పరాజయాలు సంబంధం లేకుండా టాప్ హీరోల సరసన అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇటీవలే ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న త్రిష, ఆ తర్వాత పలు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అజిత్‌తో కలిసి ‘విదాముయార్చి’ (తెలుగులో ‘పట్టుదల’) లో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే త్రిష దానికి ఏమాత్రం నిరాశ చెందకుండా, స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకుంటోంది.
ప్రస్తుతం త్రిష కమల్ హాసన్ మూవీ ‘థగ్ లైఫ్’ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ లో హీరోయిన్గా నటిస్తోంది. అజిత్ మూవీ ఫ్లాప్ అయినా, ఇప్పుడు కమల్ హాసన్, చిరంజీవిల సరసన నటించడం ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే, మరో ఐదేళ్లపాటు త్రిష టాప్ లీగ్‌లో కొనసాగడం ఖాయం.
ఇదిలా ఉంటే, త్రిష తన బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ డ్రామా ‘96’ కు సీక్వెల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం త్రిష మరోసారి విజయ్ సేతుపతితో జోడీ కట్టనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి త్రిష మాత్రం ఎప్పటికీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా, టాప్ లీగ్‌లో దూసుకుపోతూ దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది!
Recent Random Post:















