హరీష్ శంకర్ కొత్త బ్లాక్‌బస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్

Share


పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, రంజాన్, ఉగాది, లాంగ్ వీకెండ్ సమయంతో భారీ ఓపెనింగ్స్ నమోదు చేయనుందని బాక్సాఫీస్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే సాగుతున్నాయి. సెన్సార్ రిపోర్ట్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ వచ్చే రెండు రోజులలో విడుదల అవ్వనుంది. అతి పెద్ద ప్రీ‑రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే సమయంలో నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ధురంధర్‌ 2తో ఉస్తాద్ భగత్ సింగ్‌ పోటీ చేస్తుందంటూ ప్రచారం సాగుతోంది.

గత సంవత్సరం విడుదలైన ధురంధర్‌ భారీ విజయాన్ని సాధించడంతో, షూటింగ్ పూర్తి అయిన వెంటనే ధురంధర్‌ 2ను రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 19న ధురంధర్‌ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా, ఈ సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఫిక్స్ అయిన యశ్ టాక్సిక్ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన తర్వాతే టాక్సిక్ సినిమాను వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ, “ఆదిత్య ధర్ మంచి దర్శకుడు. ఆయన నుంచి వచ్చిన Uri: The Surgical Strike సినిమా చూశాను. ఆయన సినిమాలు గొప్పగా ఉంటాయి. ధురంధర్‌ 2 కూడా అద్భుతంగా ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్‌ను ధురంధర్‌ 2కి పోటీగా రిలీజ్ చేస్తున్నాం అనే ప్రచారం వాస్తవం కాదు. మేము ఉస్తాద్‌ను కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదల చేస్తున్నాం. ధురంధర్‌ 2 పాన్‑ఇండియా రిలీజ్, మా సినిమా కాబట్టి రెండు సినిమాలకు ఎక్కడా పోటీ లేదని స్పష్టంగా చెప్పగలను” అని తెలిపారు.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన కాంబోతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదట ఈ సినిమా తమిళ రీమేక్ అనేవో వార్తలు వచ్చాయి, కానీ పూర్తిగా కొత్త కథతో హరీష్ శంకర్ సినిమా రూపొందిస్తున్నట్టు యూనిట్‌ సభ్యులు తెలిపారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, రాశి ఖన్నా ముఖ్య పాత్రలో కనిపించనుంది.

పవన్ కళ్యాణ్ లుక్, మార్క్ స్టైల్, అలాగే హరీష్ శంకర్ మార్క్ కేరెక్టర్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టనుందని అభిమానులు భావిస్తున్నారు. ఓపెనింగ్ కలెక్షన్స్‌పై భారీ అంచనాలు ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్‌ 2 ప్రభావం ఉండే అవకాశం ఉంది. రెండు సినిమాలకు కొంత మేర నష్టం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ధురంధర్‌ 2కు ఉండేలా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Recent Random Post: