
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా కొనసాగడం అంటే వయసుతో పోరాడటమే. 40 ఏళ్లు దాటిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు దాదాపు మూసుకుపోయేవి. దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా 25 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న నటీమణులనే తమ కథలలో చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వయసు అనే గోడను చెరిపేసి, ప్రతిభ ఉంటే ఏ వయసులోనైనా హీరోయిన్గా వెలుగులు చూడవచ్చు అనే స్థాయికి పరిశ్రమ ఎదిగింది.
ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే, 50 లేదా 60 ఏళ్ల హీరోల సరసన 25 ఏళ్ల నటీమణులు రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించడం కూడా సాధారణమైపోయింది. ఈ తరహా కాంబినేషన్లపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విమర్శలు వచ్చినా, వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఫిల్మ్ మేకర్స్ తమ దారిలోనే ముందుకు సాగుతున్నారు. ఆ విమర్శలు కూడా కొన్ని రోజుల్లో మాయం అవుతున్నాయి.
ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఇప్పుడు 30 ఏళ్లు దాటిన మహిళల పట్ల సమాజంలో, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో, సానుకూల మార్పు కనిపిస్తోంది. దర్శకులు, రచయితలు వయసును దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయడం చాలా ఆనందకరం. వయసుతో సంబంధం లేకుండా నటన కొనసాగించవచ్చని నేను విశ్వసిస్తున్నాను” అని తమన్నా అన్నారు.
అయితే కొందరు నటీమణులు మాత్రం వయసు పెరగడాన్ని వ్యాధిలా భావిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. “వయసు పెరగడం సహజ ప్రక్రియ. దాన్ని భయపడకూడదు. వయసు పెరుగుతున్నంత వరకూ మన జీవితం అనుభవాలతో, అందంతో మరింత పరిపూర్ణం అవుతుంది” అని చెప్పారు.
ఇక ఇటీవల కాలంలో పెళ్లైన హీరోయిన్లకు పరిశ్రమలో డిమాండ్ పెరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. పెళ్లైన నటీమణులు సీనియర్ హీరోలతో మాత్రమే కాదు, యువ హీరోల సరసన కూడా సరిపోయేలా ఉంటున్నారు. అనుభవం ఉన్న కారణంగా, నటనలో సహజత్వం రావడంతో దర్శకులు వారిని ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
Recent Random Post:















