
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత, ఆయన వారసుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడా? అనే చర్చ అభిమానుల్లో తీవ్రంగా నడుస్తోంది. పవన్ అభిమానులు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై స్పష్టత లేకపోవడంతో పుకార్లే మిగిలాయి. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ గానీ, రేణు దేశాయ్ గానీ అకీరా ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
గతంలో ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ ఈ వార్తలపై స్పందిస్తూ – అకీరా సినీ రంగ ప్రవేశం చేస్తే, స్వయంగా తానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయినప్పటికీ తాజాగా అకీరా OG (ఓజీ) చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడనే పుకార్లు మళ్లీ ఊపందుకున్నాయి.
అయితే రేణు దేశాయ్ మరోసారి ఈ వార్తలను ఖండించారు. అకీరా ఓజీలో నటించట్లేదని, అలాగే రామ్ చరణ్ అతనికి కాస్ట్యూమ్స్ పంపించాడన్నది కూడా పూర్తిగా అసత్యమని తేల్చేశారు. కొన్ని వీడియోలు చూస్తే అతనికి చరణ్ దుస్తులు పంపిస్తున్నట్టు ఫార్వర్డ్ అవుతున్నాయని, కానీ అవన్నీ వాస్తవం కాదని రేణు వెల్లడించారు. అకీరా కూడా అలాంటి గాసిప్స్ తనకు పంపొద్దని చెప్పాడట.
అయితే అభిమానులు మాత్రం – ఓజీలో అయినా, లేదా భవిష్యత్తులో అయినా – అకీరా తన తండ్రి పవన్ కల్యాణ్‌తో కలిసి తెరపై కనిపించాలని ఆశిస్తున్నారు. కానీ రేణు ప్రకటనతో ఆ ఆశలు కొంతవరకు తగ్గిపోయాయి. అకీరా ఓజీలో గెస్టుగా కనిపించనున్నాడన్న వార్తలు కూడా రూమర్స్ మాత్రమేనని తేలిపోయింది.
ఇదిలా ఉంటే, రేణు దేశాయ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై, రాజకీయ ఆఫర్లపై కూడా స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం గతంలో వచ్చిన పెళ్లి ప్రతిపాదనలను తిరస్కరించానని, అలాగే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఆఫర్లను కూడా నిరాకరించానని పేర్కొన్నారు.
బద్రి, జానీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణు – పవన్‌తో ప్రేమ వివాహం చేసుకుని అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారారు. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా తన పిల్లలపై ఉన్నట్లు స్పష్టం చేశారు.
Recent Random Post:















