టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విస్తరించింది. బాహుబలితో ప్రభాస్ ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ ఎన్.టి.ఆర్ లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే పుష్పతో అల్లు అర్జున్ కూడా నేషనల్ వైడ్ గా షేక్ చేయగా అంతకుముందే అల్లు అర్జున్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా చోట్ల హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కి మలయాళం లో భారీ క్రేజ్ ఏర్పడింది. అల్లు అర్జున్ ని అక్కడ ఫ్యాన్స్ మల్లు అర్జున్ అని పిలుచుకునేంతగా అక్కడ పాపులర్ అయ్యాడు అల్లు అర్జున్.
బన్నీ సినిమాలకు మలయాళం లో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ ప్రతి సినిమా అక్కడ డబ్ అయ్యి మంచి వసూళ్లు రాబడుతుంది. తనకు ఏర్పడిన మలయాళ మార్కెట్ గురించి తెలుసుకున్న బన్నీ తన సినిమాలను అక్కడ కూడా ఒకేసారి రిలీజ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.
అప్పటి నుంచి అల్లు అర్జున్ కి మలయాళంలో కూడా మార్కెట్ భారీగా పెరిగింది. ఎంతగా అంటే అక్కడ స్టార్ హీరోలు కూడా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అంటే భయపడే రేంజ్ లో అన్నమాట. బన్నీకి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఏమాత్రం తగ్గకుండా మలయాళం లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఒక తెలుగు హీరోగా అల్లు అర్జున్ మాత్రమే సాధించిన ఒక గొప్ప అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. మన దగ్గర తమిళ స్టార్స్ రజినీకాంత్ కమల్ హాసన్ సూర్య విక్రమ్ లకు ఎలా ఫ్యాన్ బేస్ ఉందో మలయాళంలో అంతకుమించి అల్లు అర్జున్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
అతను చేస్తున్న సినిమాలు కూడా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పుష్ప 1 కూడా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు కేరళ విద్యార్ధురాలికి ఆర్థిక సాయాన్ని అందించి తన గొప్ప మనసు చాటుకున్నాడు అల్లు అర్జున్.
అక్కడ అసలే స్టార్ రేంజ్ ఏర్పడగా తన హెల్పింగ్ నేచర్ తో మరింత మందికి దగ్గరయ్యాడు అల్లు అర్జున్. బడా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినిమాలను చాలా సరదాగా తీసుకోవచ్చు.. కానీ స్టార్ గా ఎదగాలంటే నటుడిగా పరిణితి సాధించాలని మొదటి సినిమా నుంచి కష్టపడుతూ వచ్చిన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా అదరగొట్టేస్తున్నాడు.
Recent Random Post: