
అక్కినేని అఖిల్ మరియు జైనాబ్ రవ్జీలు ఈ ఏడాది జూన్ 6న వివాహ బంధంలో ఒక్కటయ్యారు. పెళ్లి నిశ్చితార్థాన్ని కొద్ది సన్నిహితుల మధ్య నాగార్జున ఇంట్లో సింపుల్ గా చేసుకున్నప్పటికీ, రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం వీరి మొదటి దీపావళి కావడం విశేషం, అందువల్ల వారు దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
తాజాగా జైనాబ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో భర్త అఖిల్ తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. జంట సంప్రదాయ వేషధారణలో ఉండి దీపావళి సందడి చేసుకున్నారు. ఫోటోల్లో అఖిల్ నేవీ బ్లూ కలర్ కుర్తా లో కనిపించినా, జైనాబ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ తో శారీ లో మెరిసిపోతున్నది ప్రత్యేక ఆకర్షణ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లు కొత్త జంటకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. జైనాబ్ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ ఇలా ఉంది:
“మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు తో ఉండాలని కోరుకుంటున్నాను.”
అక్కినేని కుటుంబంలో కొత్త కోడళ్లు అయిన శోభిత ధూలిపాళ్, జైనాబ్ గురించి ఇటీవలే అమల అమల తన ఇన్‌స్టా లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా కోడళ్లు ఇద్దరూ బంగారం” అని పొగుడుతూ చెప్పిన విషయం తెలిసిందే.
అక్కినేని అఖిల్ ప్రేమకథ విషయానికి వస్తే.. ముందుగా అఖిల్ శ్రియా భూపాల్ ను ప్రేమించి, ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగినప్పటికీ, పెళ్లి సమయం దగ్గరగా వచ్చినప్పుడు వారి మధ్య విభేదాలు ఏర్పడి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత అఖిల్, జైనాబ్ రవ్జీలతో ప్రేమలో పడిపోయారు. అనేక సంవత్సరాల పాటు కొనసాగిన వారి ప్రేమకథకు కుటుంబం ఆమోదం తెలిపింది.
జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్జీ కు నాగార్జునతో సన్నిహిత సంబంధం ఉండడంతో, ఈ పెళ్లి కుటుంబ పెద్దుల ఆమోదంతో ఘనంగా జరిగింది.
Recent Random Post:














