అఖండ 2 టికెట్ రేట్లలో 20% ఆదాయం చారిటీకి

Share


అఖండ 2 రిలీజ్ ఫీవర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కప్పేస్తోంది. ఏపీలో ఇప్పటికే అనుమతులు వచ్చాయి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా సినిమా టికెట్ రేట్లు పెరిగితే ప్రేక్షకుల జేబులు ఖాళీ అవుతాయని వారు ఫీల్ అవుతారు. కానీ ఈసారి బాలకృష్ణ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం వినగానే ఆ బాధ తగ్గేలా ఉంది. ఎందుకంటే ఈ పెంపులో కేవలం వ్యాపార లాభమే కాదు, ఒక మంచి ఉద్దేశ్యం కూడా దాగి ఉంది.

భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం ఇప్పుడు ఇండస్ట్రీలో సాధారణమే. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రికవరీ కోసం దీన్ని చేస్తున్నారు. అయితే ఈసారి ‘అఖండ 2’ టీమ్, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెరుగనున్నాయి. కానీ ముఖ్యమైన అంశం ఏమిటంటే… పెంచిన అదనపు రేట్లలో 20 శాతం మొత్తాన్ని చారిటీ కార్యక్రమాలకు కేటాయించనున్నారు. అంటే, ఒక్క టికెట్ నుండి వచ్చే ప్రతి వంద రూపాయిలో ఇరవై రూపాయలు నేరుగా సేవా కార్యక్రమాలకు వెళ్తాయి.

ఇది నిజంగా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలవుతున్నట్లు ఉంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ ఇప్పటికే ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం అలాంటి సేవలకు వెళ్తుందంటే, ప్రేక్షకులకు కూడా సంతోషంగా ఉంటుంది. సినిమా చూస్తూ, పరోక్షంగా ఒక మంచి పనిలో భాగస్వామి అవుతున్నట్లు ఫీలవుతారు.

రేట్లు పెరిగినా, ఆ డబ్బు పేదవాడికి ఉపయోగపడుతుందని తెలుసుకుంటే, విమర్శలు కూడా తగ్గే అవకాశం ఉంది. రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లోనూ బాలయ్య తన ప్రత్యేకతను చూపుతున్నారు. ఫలితం ఏమైనా, ఈ మంచి నిర్ణయానికి ప్రేక్షకులంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


Recent Random Post: