
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆది, తన కెరీర్ ప్రారంభం నుంచే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘మయసభ’ వెబ్ సిరీస్‌లో ఆకట్టుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆది ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2: తాండవంలో ఆది విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని టాక్.
అఖండ 2తో పాటు ఇప్పుడు ఆది మరో భారీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. అయితే ఈసారి ఆయన నటించబోయేది తెలుగు సినిమా కాదు. కార్తీ హీరోగా తమిళ దర్శకుడు తమిజ్ రూపొందిస్తున్న మార్షల్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నాయని, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెబుతున్నారు. అసలు ఈ పాత్ర కోసం ముందుగా నవీన్ పౌలీని అనుకున్నారు కానీ చివరికి ఆది పినిశెట్టిని ఫైనల్ చేశారు.
ఈ సినిమాలో ఆది తోపాటు పలువురు మలయాళ నటులు కూడా నటించనుండగా, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాదు, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా స్పెషల్ రోల్లో కనిపించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Random Post:














