అనురాగ్ కశ్యప్ టాలీవుడ్‌లోకి స్ట్రాంగ్ విలన్‌గా ఎంట్రీ

Share


బాలీవుడ్‌లో దర్శకుడు మరియు నటుడిగా తన ప్రత్యేక గుర్తింపు పొందిన అనురాగ్ కశ్యప్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నారని చెప్పాలి. ఒకప్పుడు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా నటనపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.

అనురాగ్ ఇప్పటికే బాలీవుడ్‌లో నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన తర్వాత, నార్త్ నుంచి సౌత్ వరకు అనేక ఆఫర్లు పొందుతున్నారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ్ సినిమాలో అనురాగ్ పోషించిన విలన్ పాత్రకు తెలుగులో కూడా మంచి స్పందన వచ్చింది. ఆయన యాక్టింగ్‌లో కనిపించిన నేచురాలిటీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కి టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ఆ సినిమా తర్వాత, సౌత్‌లో అనురాగ్‌కు అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే ఆయన తెలుగు సినిమాల్లో కూడా రోల్స్‌ సొంతం చేసుకుంటున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో విలన్‌గా నటిస్తూ, కథలో కీలకమైన, నెగెటివ్ షేడ్స్‌లో కొత్తగా కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా కూడా ఆయన పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

అదేవిధంగా, మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా అనురాగ్ పేరు వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో రూపొందనున్న మెగా 158 సినిమాలో ఆయన విలన్‌గా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పాత్ర కోసం అనురాగ్‌ను సంప్రదించారని సమాచారం.

సినిమాలో చిరంజీవికి ధీటుగా నిలిచే పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రకు అనురాగ్ సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్టింగ్ మెగాస్టార్‌కు సరితూగుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఈ కాంబినేషన్ నిజమైతే మెగా 158పై అంచనాలు మరింత పెరుగుతాయని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న అనురాగ్, ఇప్పుడు దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు పొందుతూ, విలన్ పాత్రల్లో కొత్త స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్‌లో కూడా ఆయన కెరీర్ దూసుకెళ్తుందని అనుకోవచ్చు. మెగా 158లో ఆయన ఎంట్రీ అధికారికంగా ప్రకటించబడిన తర్వాత, టాలీవుడ్‌లో మరో స్ట్రాంగ్ విలన్‌కి స్వాగతం పలికినట్లే ఉంటుంది.


Recent Random Post: