అప్పుడు చిరుతో ఇప్పుడు చ‌ర‌ణ్‌తో

టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ల ప్ర‌వేశం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అమితా బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, బాబి డియోల్, అర్జున్ రాంపాల్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి స్టార్లు గ‌తంలో తెలుగు సినిమాల్లో న‌టించారు. అమితాబ్, బాబి డియోల్ ఇటీవ‌ల వ‌రుసగా సౌత్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. క‌ల్కి 2898 ఏడిలో అమితాబ్ న‌టించారు. త‌ద‌ప‌రి ఈ సినిమా సీక్వెల్ లోను ఆయ‌న క‌నిపిస్తారు. మ‌రోవైపు బాబి డియోల్ యానిమ‌ల్, కంగువ త‌ర్వాత బాల‌కృష్ణ సినిమాలో క‌నిపించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గానే స‌ల్మాన్ ఖాన్ త‌న స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాలో న‌టించ‌నున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఉప్పెన ఫేం బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. స‌ల్మాన్ గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ లో న‌టించారు.

ఈ మూవీ కోసం చ‌ర‌ణ్ స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ ని సంప్ర‌దించ‌గా, అత‌డు కాద‌న‌లేక‌పోయాడు. చిరంజీవి- చ‌ర‌ణ్‌ల‌కు స‌ల్మాన్ ఖాన్ అత్యంత స‌న్నిహితుడు. ఇరు కుటుంబాల న‌డుమా మంచి సాన్నిహిత్యం ఉంది. స‌ల్మాన్ చిరు కుటుంబం ఆతిథ్యం ఇస్తుంది. అలాగే ముంబై వెళితే చ‌ర‌ణ్ త‌ప్ప‌నిస‌రిగా స‌ల్మాన్ ని క‌లుస్తుంటారు.

అంత మంచి బాండింగ్ ఉంది గనుక‌.. ఇప్పుడు చ‌ర‌ణ్‌- బుచ్చిబాబు చిత్రంలోను స‌ల్మాన్ న‌టించేందుకు అభ్యంత‌రం చెప్ప‌ర‌ని గుస‌గుస వినిపిస్తోంది. స‌ల్మాన్ ఖాన్ స్థాయికి త‌గ్గ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ను బుచ్చిబాబు తీర్చిదిద్దార‌ట‌. అయితే స‌ల్మాన్ కి క‌థ‌ను నేరేట్ చేసారా లేదా? అన్న‌ది వేచి చూడాలి.

మైసూర్ లో ఇటీవ‌లే మొద‌టి షెడ్యూల్ ని ప్రారంభించిన చిత్ర‌బృందం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కి షూటింగ్ ని షిఫ్ట్ చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. చ‌ర‌ణ్ సినిమాలో స‌ల్మాన్ ఖ‌రారైతే, గాడ్ ఫాద‌ర్ త‌ర్వాత నేరుగా రెండో తెలుగు సినిమాకి స‌ల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన‌ట్టే.


Recent Random Post: