అభిమానులంద‌రి కోసం రాముణ్ణి మోక్కుతా! చ‌ర‌ణ్‌

టాలీవుడ్ సూపర్‌స్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ ఆయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే ఆయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఆయోధ్యలోని అతిధి గృహంలో బస ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి సమయంలో కూడా అభిమానులు భారీ ఎత్తున గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. దీంతో అభిమానుల్ని పలకరించేందుకు చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఉత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మేము అనుకున్న కార్యక్రమాలు చేయాలంటే, మా వెంట మీరు ఎప్పుడూ ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సాహం కనిపిస్తేనే మాకు సినిమాలు చేయాలి అనే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఎల్లప్పుడు మీ ప్రేమాభిమానులు మాకు అవసరం. శ్రీరామచంద్రుడి వేషధారణ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ ఉన్న ఫోటోల్ని ఇలా చూపిస్తుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇలాంటివి చరణ్ కి ఎనలేని భరసాని కల్పిస్తాయి. రామజన్మ భూమి పై ప్రాణ ప్రతిష్ట జరుగుతోన్న సందర్భంగా మీ అందరికీ నా సంతోషాన్ని తెలియజేస్తున్నా. జైహింద్” అని అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ, “ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. రాముడి సన్నిధానానికి వెళ్లే అవకాశం నాకు దక్కింది. నా కోసం కాదు, మీ అందరి కోసం రేపు రాముడిని కోరుకుంటా. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. లవ్ యూ ఆల్” అని అన్నారు.

ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి-రామ్ చరణ్ ముందున్న జనసందోహం మామూలుగా లేదు. కొంత మంది అభిమానులకు రామ్ చరణ్ ఫోటోలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన ద్వారా చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులకు ఎంతో దగ్గరయ్యారని తెలుస్తోంది. వారిపై ఉన్న అభిమానుల ప్రేమను మరోసారి ఈ సంఘటన ద్వారా రుజువు చేశారు.


Recent Random Post: