
స్త్రీ లేనిదే ఈ సృష్టే లేదు. అమ్మ అనేది కేవలం ఓ పిలుపు కాదు, ఓ భావన. ప్రేమ, త్యాగం, ఓదార్పు, అంకితభావం అన్నీ ఒకే చోట కలిసి ఉండే గొప్ప వ్యక్తిత్వం – అది అమ్మ. ఆమె ప్రేమ అమూల్యమైనది, వెలకట్టలేనిది. అమ్మ రుణం జీవితాంతం తీర్చుకోలేని ఓ భారం. అమ్మ ఉంటేనే జీవితం వెలుగుగా, ఆనందంగా, భరోసాగా ఉంటుంది. అందుకే ఆమె జ్ఞాపకం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
అమ్మ కష్టాన్ని గుర్తు చేసుకున్న కొడుకు గుండె లోతుల్లో బాధ కలుగుతుంది. “తాను కొడుకుగా ఏమిచేశాను?” అన్న ఆత్మగ్లానితో కొంతమంది కొడుకులు జీవితాంతం బాధపడుతుంటారు. అలాంటి అనుభూతినే కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ వ్యక్తం చేశారు.
ఓ సినిమా ప్రమోషన్ సందర్భంలో తన బాల్యానుభవాలను పంచుకుంటూ తల్లి ఎదుర్కొన్న క్షణాలను గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన శరత్ కుమార్, ఐదారు వేల రూపాయల సంపాదనతో కుటుంబాన్ని నడిపిన తల్లిని గుర్తు చేసుకున్నారు. అయితే తమ బంధువులు మాత్రం ధనికులట. వాళ్ల ఇంటికి అమ్మ వెళ్లినప్పుడు వంట చేయమని అడిగేవారట. ఆమె మంచి వంటకాలు చేసేవారు. 20-30 మందికి వంట చేసి అలరించేవారట.
అయితే ఇప్పుడే అదే ఇంటికి తల్లిని ఓ విదేశీ కారులో తీసుకెళ్లితే, అదే బంధువులు వంట చేయమని అడుగుతారా? అని శరత్ తన మనసులోని వేదనను బయటపెట్టారు. అప్పట్లో తన వద్ద డబ్బు ఉంటే, అమ్మ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనాల్సిన అవసరం ఉండేది కాదని బాధపడ్డారు.
శరత్ మాటలు విన్న హీరో సిద్ధార్థ్ కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఎంత గొప్ప వ్యక్తిగత విషయాన్ని నిస్సంకోచంగా పంచుకున్నారనే అభిమానం తో చప్పట్లతో శరత్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు.
Recent Random Post:














