
క్రైమ్ థ్రిల్లర్‌తో కొత్తదనం చూపించాలని ఆశించిన 12ఏ రైల్వే కాలనీ అల్లరి నరేష్‌కు పెద్ద ప్లస్ కాకుండా డిజాస్టర్‌గా మారింది. రెండో వారానికే వాషౌట్ కావడం వల్ల ఆయన కెరీర్ మళ్ళీ మొదటి దశలోకే వచ్చినట్టైంది. కామెడీ చేస్తే అడక్కు లాగా అనిపిస్తుందని ప్రేక్షకులు నో అన్నారు; బచ్చల మల్లితో చేసిన కల్ట్ డ్రామాను తిరస్కరించారు; ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో మెసేజ్ ఇవ్వాలన్న ప్రయత్నం కూడా పెద్దగా పనిచేయలేదు. తాజాగా ఉగ్రంలో ఇన్‌టెన్స్ రివెంజ్ ట్రాక్ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
ఏ జానర్‌కి అయినా నిజాయితీగా శ్రమిస్తున్నా, ఫలితాలు మాత్రం నెగటివ్‌గా రావడం అల్లరి నరేష్‌కు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ఆల్కహాల్. టీజర్ విడుదలై చాలా రోజులు అయినా, రిలీజ్ డేట్‌గా ప్రకటించిన 2026 జనవరి 1 ఇప్పుడు మారే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ కూడా ఎక్స్‌పరిమెంటల్ కావడంతో, పోటీ లేని సరైన టైమ్ చూసుకుని సోలో రిలీజ్ మంచిదన్న అభిప్రాయం ఉంది. మరోవైపు, నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రస్తుతం జన నాయకుడు డిస్ట్రిబ్యూషన్ మరియు అనగనగా ఒక రాజు ప్రమోషన్లతో బిజీగా ఉండటంతో, ఆల్కహాల్పై ఫోకస్ తగ్గే అవకాశం ఉన్నదని టాక్.
అదనంగా, 12ఏ రైల్వే కాలనీ ఫలితం నరేష్‌పై మానసిక ఒత్తిడి కలిగించినట్టు సమాచారం. అందుకే ఈసారి రిలీజ్ విషయంలో ఏ తప్పిదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఎప్పుడో కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా, వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన అల్లరిఓడు ఇలాంటి దశలో పడటం ఇండస్ట్రీ వర్గాలకూ విచారకరం. మహర్షి తరహా పాత్రలు కొనసాగిస్తే సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితం అవుతానన్న భావనతో, ఆ దారిలో కూడా నడవడానికి ఆయన ఆసక్తి చూపడం లేదు.
Recent Random Post:














