అల్లు-అమీర్ ఖాన్.. ఏం జరుగుతోంది?

స్టైలిష్ స్టార్ కారులో అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత ఏడాది లాల్ సింగ్ చడ్డా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ విధంగా కూడా మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దంగల్ రేంజ్ సినిమాని మళ్ళీ ప్రేక్షకులకి అందించడానికి కథలు వింటూ ఉన్నారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ హైదరాబాద్ లో మీడియా కంటికి చిక్కారు. ఉన్నపళంగా హైదరాబాద్ రావడమే కాకుండా అల్లు అర్జున్ కారులో ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి వెళ్ళడం కనిపించింది. దీంతో గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి అమీర్ ఖాన్ వెళ్తున్నారు అనే టాక్ తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా గీతా ఆర్ట్స్ గజిని సీక్వెల్ చేయాలనే ఆలోచనతో ఉంది.

ఇప్పటికే ఎఆర్ మురుగదాస్ తో కూడా ఈ సినిమా సీక్వెల్ పై అభిప్రాయం చెప్పడంతో పాటు కథపైన వర్క్ చేయాలని సూచించినట్లు టాక్. ఈ నేపధ్యంలో మురుగదాస్ గజిని సీక్వెల్ కి స్టొరీ లైన్ రెడీ చేసి అమీర్ ఖాన్ ని వినిపించడానికి సిద్ధం అయ్యారంట. ఇక అల్లు అరవింద్ అమీర్ ఖాన్ తో గజిని సీక్వెల్ తో పాటు మహాభారతం ప్రాజెక్ట్ కూడా చేయాలని అనుకుంటున్నారు. గతంలో మహాభారతం ప్రాజెక్ట్ పై తన ఇంట్రెస్ట్ ని అమీర్ ఖాన్ మీడియాకి చెప్పారు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏదో ఒకటి ఖరారు చేసుకోవడానికి వచ్చి ఉంటారని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట. మహాభారతంని సిరీస్ లో తీసుకొచ్చే ప్రయత్నం అల్లు అరవింద్ చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగా అమీర్ ఖాన్ తో ఈ కథపై చర్చలు జరిపేందుకు కూడా అల్లు అరవింద్ అతనిని హైదరాబాద్ కి ఇన్వైట్ చేశారని ప్రచారం నడుస్తుంది. అందులో అల్లు అర్జున్ ప్రత్యేకంగా అమీర్ కోసం కారుని పంపించినట్లు టాక్.


Recent Random Post: