అల్లు అరవింద్ మైత్రి గొడవ.. అసలు మ్యాటర్ ఇది!

ఇటీవల కాలంలో కొంతమంది అగ్ర నిర్మాతల మధ్యలో విభేదాలు వచ్చినట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ అయ్యాయి. నిజానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు వీలైనంతవరకు సమస్యలనలకు ఒక సిట్టింగ్ లోనే పరిష్కారం వచ్చేలా చర్చలు అయితే జరుపుతూ ఉంటారు. ముఖ్యంగా దిల్ రాజు అల్లు అరవింద్ కూడా మంచి ఫ్రెండ్లి వాతావరణం లో ఉండే విధంగా కొనసాగుతారు.

అయినప్పటికీ కూడా వారి మధ్యలో కూడా విభేదాలు ఉన్నాయి అంటూ చాలా రకాల వార్తలు అయితే వచ్చాయి. ఆ మధ్య దర్శకుడు పరశురాం కారణంగా వారి మధ్యలో గ్యాప్ వచ్చినట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ అయితే గట్టిగానే వినిపించింది. అయితే హఠాత్తుగా ఇటీవల వారు ఒక ఈవెంట్లో కలుసుకోవడం వలన గొడవేమి లేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ఇక ఇప్పుడు అల్లు అరవింద్ పై మళ్ళీ ఊహించని గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ రవితో అల్లు అరవింద్ సరదాగా చేసిన కామెంట్ ఇప్పుడు వివిధ రకాల రూపాల్లో గాసిప్స్ ను వైరల్ అయ్యేలా చేస్తున్నాయి. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ మూవీ లాంచ్ ఉండగా.. అక్కడ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిని అరవింద్ ప్రత్యేకంగా కలుసుకున్నారు.

మొదట మైత్రి మూవీ మేకర్స్ రవి దర్శకుడు చందు ఓ పక్కన నిలబడి ఎదో మాట్లాడుకుంటు ఉండగా అప్పుడే అరవింద్ వారి దగ్గరికి వచ్చి ఇలా సరదాగా అన్నారు. ‘ఏమయ్యా రవి చందు మా ఆస్థాన దర్శకుడు.. కాస్త చూసుకోవయ్యా.. గబుక్కున ఆయనను లాక్కెళ్ళిపొయేవు..’ అంటూ అల్లు అరవింద్ నవ్వుతూ సరదాగా అన్నారు. ఇక అప్పుడే పక్కనే మీడియా సభ్యులు కూడా ఉన్నారు. ఇక దాన్ని అనేక రకాలుగా మలిచి మరొక పద్ధతిలో ప్రచారాలు చేశారు.

అప్పుడు నిర్మాత దిల్ రాజుతో వచ్చిన విభేదాల తరహాలోనే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో కూడా అల్లు అరవింద్ కు విబేధాలు వచ్చాయి అని అందుకే ఆయన ఆ నిర్మాతకు ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిక చేశారు అన్నట్లు వార్తలు అల్లేశారు. నిజానికి అల్లు అరవింద్ మైత్రి మూవీ మేకర్స్ తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

ఇక ఆయన ఆ విషయంలో నిజంగా సరదాగా అన్నదే కానీ మరో ఆలోచనతో కాదు అని అర్థమవుతోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా చందు మొండేటితో ఒక సినిమా చేయాల్సి ఉందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే దానికంటే ముందే గీత ఆర్ట్స్ లో చందు కొన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. మరి ఈ కాంబినేషన్స్ ను దర్శకుడు ఎలా ముందుకు తీసుకువెళ్తాడో చూడాలి.


Recent Random Post: