అల్లు అర్జున్ – సంజయ్ దత్.. మ్యాటరెంటీ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో కల్ నాయక్ అంటే తెలియని వారు ఉండరు. స్టార్ హీరోగా సుదీర్ఘకాలం కొనసాగిన నటుడు సంజయ్ దత్ సూపర్ హిట్ మూవీ కల్ నాయక్ నే తన పేరుగా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ దత్ తన వయస్సుకి సరిపోయే పాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. వాటిలో ప్రతినాయకుడి క్యారెక్టర్స్ ఉండటం విశేషం.

బాలీవుడ్ సీనియర్ స్టార్స్ అందరూ సౌత్ సినిమాలలో మెల్లగా తన ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2లో అధీరా పాత్రలో సంజయ్ దత్ అద్భుతమైన విలనిజం పండించారు. విజయ్ లియోతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ విలన్ గా మెప్పించాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో సంజయ్ దత్ కి సౌత్ లో డిమాండ్ పెరిగింది.

ఇప్పుడు తెలుగులో కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తెలుగులో ఓ సినిమాలో సంజయ్ దత్ గెస్ట్ రోల్ చేశాడు. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు టాలీవుడ్ లో ఈ సీనియర్ బాలీవుడ్ స్టార్ చేస్తూ ఉండటం విశేషం.

పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీలో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. ప్రభాస్, మారుతి కాంబోలో రెడీ అవుతోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్ లో కూడా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంట.

అయితే ఈ క్యారెక్టర్ కంప్లీట్ ఫన్నీ మ్యానర్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు పుష్ప ది రూల్ మూవీలో కూడా సంజయ్ దత్ నటించబోతున్నాడు అనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ మూవీలో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ డాన్ గా సంజయ్ దత్ కనిపిస్తాడంట. కొద్ది రోజుల క్రితం పుష్ప 3 మూవీ కూడా ఉంటుందని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పుష్ప రాజ్ నెక్స్ట్ కొనసాగింపుగా ఇంటర్నేషనల్ డాన్ అయిన సంజయ్ దత్ క్యారెక్టర్ తో తలపడే విధంగా సుకుమార్ నెక్స్ట్ సీక్వెల్ కి స్క్రిప్ట్ లీడ్ ఇస్తున్నాడనే మాట వినిపిస్తోంది.. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.


Recent Random Post: